ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం NTR30. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా.. విలన్ గా సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నాడు.
ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం NTR30. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా.. విలన్ గా సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాకు దేవరా అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తుంది. ఎన్టీఆర్ పుట్టిన రోజైన మే 20న ఈ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని లాంచ్ చేసే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే దేవరా అనే టైటిల్ ను పవన్ కళ్యాణ్ కు సెట్ చేసినట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా పవన్ అభిమానులు…ఆయనను దేవరా అని పిలుస్తూ ఉంటారు.
పవన్ కళ్యాణ్ తేజ్ కాంబినేషన్ లో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాకి పెట్టాలని అనుకున్నారు. అయితే సినిమా కంటెంట్ క్లాస్ టచ్ తో ఉండటంతో దేవరా టైటిల్ ని పక్కన పెట్టారని..దాని ప్లేస్ లోనే బ్రో అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమచారం. ఇక దీంతో దేవరా టైటిల్ ను ఎన్టీఆర్ కు సెట్ అవుతుందని మేకర్స్ ఆ టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజం ఎంత తెలియాలంటే తారక్ బర్త్ డే వచ్చేవరకు ఆగాల్సిందే.