Badri: పవన్ ఊర మాస్ సినిమా రిలీజ్ కు సిద్ధం
Pawan Kalyan Super Hit Movie Ready For Re Release: నువ్వు నంద అయితే.. నేను బద్రి.. బద్రి నాధ్.. ఆ కళ్ళలో పౌరుషం, ఆ ఆటిట్యూడ్ పవన్ కళ్యాణ్ కు మాత్రమే సాధ్యం. పూరి జగన్నాథ్ ను డైరెక్టర్ గా నిలబెట్టిన సినిమా.. పవన్ లోని ఊర మాస్ ను బయటపెట్టిన సినిమా బద్రి. ఈ సినిమాతోనే రేణు దేశాయ్ తెలుగుతెరకు పరిచయమైంది. బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ అందాలను తెలుగువారు చూసింది ఈ సినిమాతోనే. ఇక అప్పట్లో ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా రీ రిలీజ్ కు సిద్ధమైంది. డిసెంబర్ 30న గ్రాండ్ గా రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు.
ఇక దీంతో పవన్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే హంగామా చేయడం మొదలుపెట్టారు. ఏ చికీతా, బంగాళాఖాతంలో లాంటి సూపర్ డూపర్ హిట్స్ సాంగ్స్ ను మరోసారి థియేటర్ లో చూడబోతున్నామనే అనడంలో ఫ్యాన్స్ గాల్లో తేలిపోతున్నారు. జల్సా, తమ్ముడు సినిమాలకే థియేటర్స్ ను ధ్వంసం చేసిన ఫ్యాన్స్ అసలు సిసలైన పవన్ ఊర మాస్ సినిమాకు థియేటర్ లను పేల్చకుండా ఉంచుతారో లేదో చూడాలి.