Harish Shankar: నా చావు చూసైనా ఆ సినిమా ఆపండి.. పవన్ ఫ్యాన్ సూసైడ్
Pawan Kalyan Lady Fan Suicide Note To Harish Shankar: పవన్ కళ్యాణ్ గురించి కానీ, ఆయన ఫ్యాన్స్ గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ సినిమా ఏదైనా నచ్చకపోతే డైరెక్టర్ ను ఏకిపారేస్తారు. ఇక తాజాగా హరీష్ శంకర్ పై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ముఖ్యంగా ఒక లేడీ ఫ్యాన్ అయితే.. తన చావుకు హరీష్ శంకర్ కారణమని చెప్పుకురావడం హాట్ టాపిక్ గా మారింది. అసలుఎందుకు ఇదంతా అంటే.. పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్నట్లు వార్తలు వచ్చాయి. హరీష్ కూడా అధికారికంగా కన్ఫర్మ్ చేశాడు. అయితే ఆ సినిమా కోలీవుడ్ హీరో విజయ్ నటించిన తేరి రీమేక్ అని తెలియడంతో ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
మాకొద్దు తేరి రీమేక్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక లేడీ ఫ్యాన్ తాను చనిపోతున్నాను అంటూ సూసైడ్ లెటర్ రాసింది. హరీష్ గారికి దయచేసి తేరి రీమేక్ తీయకండి.. మీరు ఏ రీమేక్ చేసినా అర్లేదు.. తేరి మాత్రం వద్దు.. ఆ సినిమాను టీవీలో మేము ఎన్నోసార్లు చూసాం.. ఇప్పటివరకు ఇది నిజం కాదు అనుకున్నాను.. కానీ ఇదే నిజం అనేలా అనిపిస్తోంది. నా చావు చూసి అయినా ఈ సినిమా చేయడం ఆపండి.. నా చావుకు హరీష్ శంకర్ కారణం అంటూ లెటర్ లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ లెటర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ లెటర్ పై హరీష్ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.