Pawan Kalyan: భారతీయులు గర్విస్తున్న క్షణాలు ఇవి..
Pawan Kalyan Congratulated The RRR Team For Winning The Oscar: తెలుగు జాతి గర్వపడే క్షణం ఇది. ఎన్నో తరాలు.. ఎంతోమంది తారలు సాధించలేని ఘనతను దర్శకుడు రాజమౌళి ఎట్టకేలకు సాధించాడు. ఎన్నో ఏళ్ల శ్రమ నేడు ఇంటర్నేషనల్ వేదికపై ఆస్కార్ అవార్డుతో ఫలితం దక్కింది. ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఎట్టకేలకు ఆస్కార్ ను అందుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ సాంగ్ ఆస్కార్ అవార్డును కైవసం చేసుకుంది. ఈ సాంగ్ రాసిన చంద్రబోస్, మ్యూజిక్ అందించిన కీరవాణి ఆస్కార్ అవార్డును అందుకున్నారు.
ఇక భారతదేశం గర్వపడేలా చేసిన ట్రిపుల్ ఆర్ చిత్రబృందానికి ఇండియా మొత్తం సలామ్ చేస్తోంది. అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రమఖులు సైతం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా ట్రిపుల్ ఆర్ చిత్రబృందాన్ని అభినందించారు. “భారతీయులందరూ గర్వపడేలా ఆస్కార్ వేదికపై పురస్కారాన్ని స్వీకరించిన ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్ర సంగీత దర్శకులు శ్రీ ఎం.ఎం.కీరవాణి గారికి, గీత రచయిత శ్రీ చంద్రబోస్ గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ వార్తను చూడగానే ఎంతో సంతోషించాను. ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా నిలిచిన ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రంలో ‘నాటు నాటు…’ గీతంలోని తెలుగు పదం నేల నలుచెరగులా ప్రతి ఒక్కరితో పదం కలిపేలా చేసి హుషారెత్తించింది. ఆ హుషారు ఈ రోజు ఆస్కార్ వేదిక మీద రెట్టించిన ఉత్సాహంతో కనిపించింది. ఈ వేదికపై ఈ గీతాన్ని ప్రదర్శించడంతోపాటు… అవార్డు పొందటం ద్వారా భారతీయ సినిమా స్థాయి మరో స్థాయికి చేరింది.
ఇంతటి ఘనత పొందేలా ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రాన్ని రూపొందించిన దర్శకులు శ్రీ ఎస్.ఎస్.రాజమౌళి గారికి ప్రత్యేక అభినందనలు. ఆ చిత్రంలో కథానాయక పాత్రల్లో ఒదిగిపోయిన శ్రీ ఎన్.టి.ఆర్., శ్రీ రాంచరణ్, గాయకులు శ్రీ రాహుల్ సిప్లిగంజ్, శ్రీ కాలభైరవ, నృత్య దర్శకులు శ్రీ ప్రేమ్ రక్షిత్, చిత్ర నిర్మాత శ్రీ డి.వి.వి.దానయ్యలకు అభినందనలు. ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రానికి దక్కిన ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుతోపాటు పలు అంతర్జాతీయ పురస్కారాలు భారతీయ దర్శకులు, నటులు, రచయితలకు స్ఫూర్తినిస్తుంది” అని తెలిపారు.
భారతీయులు గర్విస్తున్న క్షణాలివి
‘ఆర్.ఆర్.ఆర్.’ @RRRMovie చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు – JanaSena Chief Shri @PawanKalyan@ssrajamouli @mmkeeravaani @boselyricist @Rahulsipligunj @kaalabhairava7 @AlwaysRamCharan @tarak9999#Oscars #AcademyAwards #NaatuNaatu pic.twitter.com/zYcWxNFbHP
— JanaSena Party (@JanaSenaParty) March 13, 2023