National Film Awards: విన్నర్స్ కు పవన్‌కల్యాణ్ అభినందనలు
Pawan Kalyan Congratulated The National Film Award Winners: శుక్రవారం 68వ జాతీయ చలన చిత్ర అవార్డుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెల్సిందే. ఉత్తమ చిత్రంగా సుహాస్ చాందినీ చౌదరి జంటగా నటించిన `కలర్ ఫొటో` నిలవగా ఉత్తమ కొరియోగ్రఫీ మేకప్ విభాగాల్లో `నాట్యం` మూవీ ఎంపికఅయ్యింది. ఇక ఉత్తమ సంగీత ప్రధాన చిత్రంగా అల్లు అర్జున్ నటించిన `అల వైకుంఠ పురములో` సినిమాలు అవార్డుల్ని సొంతం చేసుకున్నాయి. సూర్య నటించిన `సూరారైపోట్రు` ఐదు అవార్డుల్ని సొంతం చేసుకుంది. ఇక జాతీయ అవార్డుల ప్రకటనతో ఆయా సినీ పరిశ్రమలకి చెందిన వారు తమ చిత్రాలు అవార్డులు గెలుచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అవార్డులను గెలుచుకున్నవారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.
“68వ జాతీయ చలన చిత్ర పురస్కార విజేతలకు హృదయ పూర్వక అభినందనలు. ఈ దఫా పురస్కారాలలో ఎక్కువ శాతం దక్షిణ భారత చిత్రసీమ నుంచి వచ్చిన చిత్రాలు దక్కించుకోవడం సంతోషించదగ్గ పరిణామం. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎస్.ఎస్.తమన్, ఉత్తమ కొరియోగ్రఫీ శ్రీమతి సంధ్యా రాజు (నాట్యం), ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ టి.వి.రాంబాబు (నాట్యం), ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కలర్ ఫోటో’ జాతీయ పురస్కారాన్ని కైవసం చేసుకోవడం ఆనందంగా ఉంది. వీరందరికీ నా అబి?నందనలు, ఈ స్ఫూర్తితో వీరి నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలని ఆకాంక్షిస్తున్నాను” అని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు.
జాతీయ సినీ పురస్కార విజేతలకు అభినందనలు – JanaSena Chief Shri @PawanKalyan#68thNationalFilmAwards pic.twitter.com/aNXt82GUq2
— JanaSena Party (@JanaSenaParty) July 22, 2022