Pawan Kalyan: యాక్షన్ హీరో కోసం తరలివచ్చిన పవర్ స్టార్
Pawan Kalyan Attends Launching Ceremony Of Vishwak Sen New Movie: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవలే అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత విశ్వక్, కన్నడ స్టార్ హీరో, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే. విశ్వక్ సేన్ 11వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నేడు హైదరాబాద్ లోని రామా నాయుడు స్టూడియంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది.
ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరవ్వడంతో ఒక్కసారిగా ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. పవన్ ముఖ్య అతిధిగా హాజరై, హీరో హీరోయిన్ల పై క్లాప్ కొట్టి చిత్ర బృందానికి అల్ ది బెస్ట్ చెప్పారు. మొదటి నుంచి హీరో అర్జున్ తో పవన్ కు మంచి స్నేహం ఉంది. దాంతో, అర్జున్ నుంచి ఆహ్వానం అందగానే పవన్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారని సమాచారం ఇక ఈ చిత్రంలో అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటించడం విశేషం.
ఇక ఈ సినిమాలో అర్జున్‌కి మంచి స్నేహితుడైన జగపతిబాబు కీలకపాత్ర పోషించనున్నాడు. ఇక ఈ చిత్రానికి ‘కెజీయఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. మరికోదిరోజుల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టనున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ సినిమా తో పాగల్ హీరో ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలి.