Pawan Kalyan: పవన్- అలీ కాంబో మళ్లీ రీపీట్..?
Pawan Kalyan- Ali Combo Repeat: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- కమెడియన్ అలీ ల మధ్య ఉన్న స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘బద్రి’ నుంచి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వరకు అలీ లేని పవన్ సినిమాను ఉహించుకోలేము.. కామెడీ కి వీరి కాంబో పెట్టింది పేరు.. ఇక కొన్ని రాజకీయ విబేధాల వలన వీరి మధ్య స్నేహం తెగిపోయిందని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి.
రాజకీయంగా అలీ ఒక పార్టీని సపోర్ట్ చేయడం, పవన్ పార్టీపై విమర్శలు గుప్పించడంతో వీరు దూరమయ్యారని వార్తలు వినిపించాయి. అంతేకాకుండా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తరువాత అలీ- పవన్ కాంబో రిపీట్ కాలేదు. దీంతో అభిమానులు పవన్ – అలీ మధ్య గొడవలు జరుగుతున్నాయని ఫిక్స్ అయిపోయారు. అయితే తాజాగా సిల్వర్ స్క్రీన్ పై మళ్ళీ తమ కాంబో కనిపిస్తుంది అని ఆలీ క్లారిటీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
అలీ నిర్వహించే ఒక టాక్ షో లో ఈ విషయాన్ని ఆయన కన్ఫర్మ్ చేశాడు. త్వరలోనే పవన్ తో ఒక సినిమాలో కనిపించబోతున్నట్లు చెప్పడంతో పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాంబో కామెడీ మళ్లీ రిపీట్ కానుందని తెలియడంతో అది ఏ సినిమా అని అభిమానులు ఆరాలు తీయడం మొదలు పెట్టారు. మరి పవన్ నటిస్తున్న ఏ చిత్రంలో అలీ కనిపిస్తాడో చూడాలి.