Pawan Kalyan: బ్రేకింగ్.. పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి..?
Pawan Kalyan 4th Marriage Rumors Viral In Social Media: రాజకీయాలు అన్నాక విమర్శలు ఉంటాయి.. ప్రశంసలు ఉంటాయి. తప్పు చేసినా పడాల్సిందే.. ఒక్కోసారి తప్పుచేయకపోయినా నిందలు భరించాల్సిందే. అవన్నీ నిలదొక్కుకున్నవాడే నిజమైన నాయకుడిగా నిలబడతాడు. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిజమైన నాయకుడిగా ఎదగడానికి ఎంతగానో కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ప్యాకేజీ స్టార్ అని, చంద్రబాబు బానిస అని, మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని, డబ్బు కోసం రాజకీయాలు చేస్తున్నాడని అధికార పార్టీ నేతలు ఎన్ని విమర్శిస్తున్నా.. ఆయన తనకు తోచిన విధంగా ప్రతిఘటిస్తున్నారే తప్ప.. వారిని గెలవలేకపోతున్నారు అనేది వాస్తవం. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. పవన్ అభిమానులను, వారి ఎమోషన్స్ ను కూడా అధికార పార్టీ నేతలు, వారి అనుచరులు, పవన్ హేటర్స్, ట్రోలర్స్ ఆడేసుకుంటున్నారు.
గత కొంతకాలంగా పవన్ రాజకీయాలకు పనికిరాడని, సీఎం అయ్యే ఛాన్స్ లేదని సోషల్ మీడియాలో చాలామంది చెప్పుకొస్తూనే ఉన్నారు.. ఇక వాటికి తోడు మరో కొత్త పుకారును ట్రోలర్స్ సృష్టించారు. అదే పవన్ నాలుగో పెళ్లి. ఇప్పటివరకు పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ప్రస్తుతం మూడో భార్య అన్నా లెజినావోతో కలిసి ఉంటున్నారు. గత కొన్ని తోజులుగా వారి మధ్య విబేధాలు నెలకొన్నాయని, వారు ప్రస్తుతం దూరంగా ఉంటున్నట్లు చెప్పుకొస్తున్నారు. ఇక ఆమెతో విడిపోయాక పవన్ నాలుగో పెళ్లి కూడా చేసుకుంటాడని ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇదే విషయాన్నీ జ్యోతిష్యుడు వేణు స్వామి కూడా చెప్పడంతో త్వరలోనే పవన్ నాలుగో పెళ్లి చేసుకొనే అవకాశాలు ఉన్నాయని ట్రోలర్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉన్నది అనేది తెలియాల్సి ఉంది.