Pathaan Twitter Review: ఎవరి వల్ల కాదు.. మళ్లీ షారుఖే నిలబెట్టాడు
Pathaan Twitter Review: గత కొన్నినెలలుగా బాలీవుడ్ లో సరైన హిట్ పడిందే లేదు. స్టార్ హీరోలు సైతం ట్రై చేసినా లాభం లేకపోయింది. దీంతో బాలీవుడ్ పతనం మొదలయ్యింది అని ఇండస్ట్రీలో రూమర్స్ గుప్పుమన్నాయి. ఇక ఎలాగైనా బాలీవుడ్ ను నిలబెట్టాలి అని కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పైనే భారం వేశారు అభిమానులు. ఇక వారి కోరికను ఎట్టకేలకు షారుఖ్ నెరవేర్చాడు. అవును .. పఠాన్ సినిమాతో బాలీవుడ్ పూర్వ వైభవం తెచ్చుకుంది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ సినిమా నేడు రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకొంది. రా ఏజెంట్ గా పఠాన్ నటన, ఫైట్స్ బాలీవుడ్ సత్తాను మరోసారి చూపించాయి. ఇక దీపికా అందాలు సినిమాకే హైలైట్ గా నిలిచాయి.
సిద్దార్థ్ ఆనంద్ టేకింగ్, నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉండడంతో పాటు కథ కూడా ప్రేక్షకులకు నచ్చడంతో బాలీవుడ్ పెద్ద హిట్ ను అందుకుంది. దీంతో షారుఖ్ అభిమానులు ట్విట్టర్ లో తమ రివ్యూలను పోస్ట్ చేస్తున్నారు. షారుఖ్.. మళ్లీ బాలీవుడ్ ను నిలబెట్టాడు. అతని యాక్షన్ సూపర్ అని ఒకరు అంగ.. మరొకరు.. హమ్మయ్య ఎట్టకేలకు పఠాన్ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా షారుఖ్ యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా ఎంజాయ్ చేశాను అని చెప్పుకొచ్చాడు. ఇక బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేస్తూ.. బ్లాక్ బస్టర్ పఠాన్.. నువ్వు సాధించావ్ అంటూ చెప్పుకొచ్చారు. ఇక తెలుగు ప్రేక్షకులు సైతం సినిమా బావుందని చెప్పడం విశేషం. దేశం కోసం ఒక రా ఏజెంట్ చేసిన ధైర్య సాహసాలే ఈ సినిమా.. మరి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలక్షన్ల పరంగా ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.