Pathaan: డిజిటల్ పార్టనర్ ను లాక్ చేసిన పఠాన్
Pathaan OTT Partner Locked: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా నటించిన చిత్రం పఠాన్. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఎప్పటి నుంచో బాలీవుడ్ ఎదురుచూస్తున్న విజయాన్ని షారుఖ్ అందించాడు. రా ఏజెంట్ కథతో తెరకెక్కిన ఈ చిత్రంలోస్ షారుఖ్ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం అల్టిమేట్ అని చెప్పాలి. ఇక ఈ సినిమా డిజిటల్ ఎంట్రీపై అభిమానుల కన్ను పడింది. ఏ ఓటిటీలో ఈ సినిమా రాబోతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు సమాచారం. అదే చిత్రం ముగింపు క్రెడిట్‌ల సమయంలో ప్రదర్శించబడింది. టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ వీకెండ్ భారీగా వసూళ్లు రానున్నాయి. ఇక అంతే కాకుండా యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం లో జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించారు. మరి ఈ చిత్రం ముందు ముందు ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.