Sheela Kaur: అల్లు అర్జున్ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది
Parugu Movie Heroine Sheela Kaur Latest Photo Viral In Social Media: కొంతమంది హీరోయిన్లు ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ఎప్పుడు వెళ్ళిపోతారో ఎవరికి తెలియదు. కానీ, కొంతమంది హీరోయిన్లు మాత్రం తీసినవి కొన్ని సినిమాలే అయినా అభిమానుల గుండెల్లో ఎప్పటికి నిలిచిపోతారు. అలాంటి హీరోయిన్స్ లో షీలా కౌర్ ఒకరు. అల్లు అర్జున్ నటించిన పరుగు సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది షీలా.. ఈ సినిమా తరువాత రాజు భాయ్, మస్కా, అదుర్స్ వంటి సినిమాలలో నటించి మెప్పించిన ఈ హీరోయిన్ స్టార్ డమ్ ను అందుకోకపోయినా అవకాశాలను బాగానే అందుకోంది. అయితే.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే వ్యాపారవేత్త సంతోష్ రెడ్డిఅనే వ్యక్తిని వివాహమాడిన ఈ బ్యూటీ ఆ తరువాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ జంటకు ఒక పాప కూడా ఉంది.
సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వకపోయినా సోషల్ మీడియాలో మాత్రం షీలా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఆమె తన కూతురుతో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక తాజాగా ఆమె లేటెస్ట్ ఫోటో నెట్టింట వైరల్ గా మారిపోయింది. షీలా అప్పటికి ఇప్పటికే కొద్దిగా మారినట్లు కనిపిస్తోంది. కర్లీ హెయిర్ తో కొద్దిగా బక్కచిక్కి కనిపించింది.. ఇక షీలాను చూసిన అభిమానులు అరే.. పరుగు హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.