యంగ్ హీరో తిరువీర్, పావని జంటగా రూపక్ రోనాల్డ్ సన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పరేషాన్.
యంగ్ హీరో తిరువీర్, పావని జంటగా రూపక్ రోనాల్డ్ సన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పరేషాన్. వాల్తేరు వీరయ్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రానికి రానా దగ్గుబాటి సమర్పకుడిగా రావడంతో విపరీతమైన బజ్ ఏర్పడింది. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రం విడుదల కాబోతుంది.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ మొత్తం కామెడీతో నింపేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినట్లు ట్రైలర్ ను బట్టి అర్ధమవుతుంది. ఆహ్లాదకరమైన విలేజ్ డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమా చాలా కామెడీగా ఉంది. అద్భుతమైన టైమింగ్ తో ఆకట్టుకుంటున్న తిరువీర్ పాత్ర కూడా అదిరిపోయింది.
చదువుకోకుండా తిని తిరుగుతున్న ముగ్గురు యువకుల జీవితాల్లో ఎదురైన సంఘటనల సమూహారమే పరేషాన్ సినిమా అని తెల్సుతుంది. కడుపుబ్బా నవ్వించే డైలాగ్స్, ఒరిజినల్ గా మన ఇంట్లో కనిపించే పాత్రలులానే ఉండడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఈ చిత్రానికి వాసు పెండమ్ ఛాయాగ్రహకుడిగా పని చేస్తుండగా.. శ్వంత్ నాగ్ చౌరస్తా సంగీతం అందిస్తున్నారు. ఇక మసూద తరువాత హీరో తిరువీర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అతడి అభిమానులు కూడా బాగా ఎదురుచూస్తున్నారు. జూన్ రెండో తేదీన ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమాతో తిరువీర్ వరుస విజయాలను అందుకుంటాడో లేదో చూడాలి.