రియల్ శ్రీమంతుడిగా పేరొందిన హర్షసాయి యూట్యూబ్‌లో పెద్ద సంచలనం.
Harsha Sai New Movie : రియల్ శ్రీమంతుడిగా పేరొందిన హర్షసాయి(Harsha Sai ).. యూట్యూబ్‌లో(youtube star harsha sai) పెద్ద సంచలనం. పాన్ ఇండియా యూట్యూబర్‌గా మిలియన్ల మంది ఫాలోవర్స్‌ని సంపాదించిన హర్షసాయి టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దమైంది. బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ(bigg boss fame mitraaw sharma ).. కొత్త సినిమాతో కనువిందు చేయడానికి రెడీ అయ్యారు. బిగ్ బాస్ ఓటీటీ (bogg boss ott) సీజన్ 1లో ఫైనలిస్ట్‌గా నిలిచిన మిత్రా శర్మ(mitraaw sharma) తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టింది. శ్రీ పిక్చర్స్ ద్వారా నిర్మాతగా మారిన మిత్రా శర్మ.. లాంగ్ గ్యాప్ తరువాత మళ్లీ నిర్మాణ బాధ్యతల్ని చేపట్టబోతున్నారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఓ పాపులర్ సెలబ్రిటీ భాగస్వామ్యం కాబోతున్నారు. ది మోస్ట్ పాపులర్ యూట్యూబర్ హర్షసాయి.మిత్రా శర్మ నిర్మించబోయే ఈ చిత్రం ద్వారా యూట్యూబర్ హర్షసాయి హీరోగా (youtuber harsha sai)ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కేవలం హీరోగానే కాకుండా దర్శకత్వ బాధ్యతల్ని కూడా నిర్వహించబోతున్నాడు . అటు మిత్రా శర్మా(mitraaw sharma).. ఇటు హర్షసాయి ఈ ఇద్దరి కాంబోలో సినిమా అంటే మంచి అంచనాలే ఉంటాయి.
యూట్యూబ్‌లో 8.64 మిలియన్ల మంది.. ఇన్‌స్టాగ్రామ్‌లో 4 మిలియన్ల మంది.. ఇక ఫేస్ బుక్‌లో ఇతర సోషల్ మీడియాలో ప్లాట్ ఫామ్స్‌లో హర్షసాయిని ఫాలో అయ్యే ఫాలోవర్స్ 10 మిలియన్ల మందికి పైగానే వుంటారు.. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ ఇలా చాలా భాషల్లో హర్షసాయికి ఫ్యాన్ పేజ్‌లు ఉన్నాయంటే మనోడు క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. హర్షసాయి వీడియో చేశాడంటే.. లక్షల్లో, కొన్నిసార్లు కోట్లలో కూడా ఖర్చు అవుతుంది. క్వాలిటీకి దగ్గట్టే కంటెంట్ ఉంటుంది. అన్నింటికి మించి.. ఎదుటి వాళ్లకి సాయం చేయాలనే గుణం తన ప్రతి వీడియోలోనూ కనిపిస్తూ ఉంటుంది.
ఒక్క వీడియో చేయాలంటే హర్షసాయి చాలా గ్రౌండ్ వర్క్ చేస్తాడట. కొన్ని నెలలు.. సంవత్సరాలు కూడా తాను చేయాలనుకున్న వీడియోకోసం వెచ్చిస్తుంటాడట. ఖర్చు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. అయితే గత కొంతకాలంగా హర్షసాయి వీడియోలకు బ్రేక్ ఇచ్చాడు. అయితే ఈ బ్రేక్ వచ్చింది కాదు.. కావాలని ఇచ్చిందే అన్నట్టుగా క్రేజీ అప్డేట్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆదిపురుష్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ పళని ఈ చిత్రానికి తన కెమెరా పనితనం చూపించబోతున్నారు.సిక్స్ ప్యాక్‌తో హర్షసాయి(harsha sai movie) హీరో మెటీరియల్‌నే. కాబట్టి.. త్వరలో హర్షసాయి సినిమాల్లోకి ఎంట్రీ ఉంటుందనే వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్ని నిజం చేస్తూ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మిత్రా శర్మ.. నిర్మాణంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలో బయటకు రానుంది. ఏది ఏమైనా యూట్యూబర్ హర్ష సాయి సినిమా చేస్తున్నాడంటే ఇంకా ఏ రేంజ్ లో సినిమా తీయబోతున్నాడో వెయిట్ చేయాల్సిందే.