ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెల్సిందే. దేవర, వార్ 2, ఎన్టీఆర్ 31.. ఇలా అన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కు సైన్ చేశాడు.
ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెల్సిందే. దేవర, వార్ 2, ఎన్టీఆర్ 31.. ఇలా అన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కు సైన్ చేశాడు. ప్రస్తుతందేవర షూటింగ్ లో పాల్గొంటున్నాడు ఎన్టీఆర్. జనతా గ్యారేజ్ తరువాత కొరటాల శివ- ఎన్టీఆర్ కాంబో లో వస్తున్న చిత్రం దేవర.. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా తరువాత అందరి చూపు ఎన్టీఆర్ 31 మీదనే ఉంది. కెజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31 తెరకెక్కుతోంది. గతేడాది ఇదే రోజు ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ లో ఎన్టీఆర్ ఉగ్ర రూపంలో కనిపించాడు.
ఇక నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. దీన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ 31 సినిమా చిత్రబృందం అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో ఎన్టీఆర్ 31వ సినిమా రాబోతుందని తెలిపారు. అంతే కాకుండా ఈ సినిమా చిత్రీకరణ 2024 మార్చ్ నుంచి మొదలు పెట్టబోతున్నట్లు ప్రకటిస్తూ ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు సమాచారం. తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే.. తెలుగులో తెరకెక్కించి మిగతా భాషల్లో డబ్ చేయకుండా.. అన్ని భాషల్లో ఒరిజినల్ చిత్రంగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ సినిమాతో ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ ఎలాంటి రికార్డులు బద్దలు కొడతారో చూడాలి.