#NTR30FirstLook:ఒక ఉప్పెన తరువాత వచ్చేది అంతకు మించి ఉంటుందని ప్రతి ఒక్కరూ అంచనాలు వేస్తారు..అలాగే ఉండాలని ప్రత్యేకంగా ఫ్యాన్స్ కోరుకుంటారు.
#NTR30FirstLook:ఒక ఉప్పెన తరువాత వచ్చేది అంతకు మించి ఉంటుందని ప్రతి ఒక్కరూ అంచనాలు వేస్తారు..అలాగే ఉండాలని ప్రత్యేకంగా ఫ్యాన్స్ కోరుకుంటారు. అలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. జక్కన్న తెరకెక్కించిన విజువల్ వండర్ `ఆర్ ఆర్ ఆర్`(RRR) ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయి సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే. రామ్ చరణ్‌తో కలిసి ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా గోల్డెన్ గ్టోబ్, ఆస్కార్ అవార్డుల్ని దక్కించుకుని భారతీయ సినీ చరిత్రలో చరికొత్త చరిత్రని సువర్ణాక్షరాలతో లిఖించి భారతీయ సినిమా గొప్పదనాన్ని యావత్ ప్రపంచం వేనోళ్లతో పొగిడేలా చేసింది.
ఇలాంటి చారిత్రాత్మక సినిమా తరువాత ఎన్టీఆర్ చేస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ #NTR30(వర్కింగ్ టైటిల్). ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో యువ సుధా ఆర్ట్స్ బ్యానర్‌పై సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అత్యంత కసితో తనపై వచ్చిన విమర్శలకు ధీటుగా ఈ సినిమాతో సమాధానం చెప్పాలనే ఆలోచనతో తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఎన్టీఆర్ పుట్టిన రోజుని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి 7:02 గంటలకు ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్ పోస్టర్ని రిలీజ్ చేస్తున్నారు. `దేవర` అనే టైటిల్ ఖాయం చేశారు. `మిర్చి` నుంచి `భరత్ అనే నేను వరకు అపజయమెరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కొరటాల శివ `ఆచార్య`తో భారీ డిజాస్టర్‌ని సొంతం చేసుకుని షాకిచ్చారు. ఇది ఆయన కెరీర్‌కు మాయని మచ్చగా మారింది. ఈ సినిమా విషయంలో తప్పు తన వల్ల జరిగిందా? లేక తనని తొందరపాటుకు గురి చేయడం వల్ల జరిగిందా? అన్నది #NTR30తో తేల్చబోతున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
డైనమేట్ లాంటి డైలాగ్‌లతో..
కథ విషయంలో రాజీపడకూడదని, ఎలాంటి తప్పులు దొర్లడానికి వీళ్లేదని చాలా సమయం తీసుకుని ఒక్కో ఇటుకని పేర్చినట్టుగా ఒక్కో సీన్‌ని కసితో రాసుకున్నారట కొరటాల. ఆ కారణంగానే మూడు నాలుగు నెలల క్రితమే ప్రారంభం కావాల్సిన ఈ సినిమా ఆలస్యంగా ఏప్రిల్‌లో సెట్స్ పైకి వెళ్లింది. పోర్ట్ నేపథ్యంలో సాగే హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోంది. మోషన్ పోస్టర్‌తో మొదటే దర్శకుడు కొరటాల శివ క్లారిటీ ఇచ్చేశారు. `అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు.. అవసరానికి మించి తను ఉండకూడదని.. అప్పుడు భయానికి తెలియాలి..తను రావాల్సిప సమయం వచ్చిందని` అంటూ మోషన్ పోస్టర్లో డైనమేట్ లాంటి డైలాగ్‌లతో సినిమా ఎలా ఉండబోతోందో..ఎన్టీఆర్ క్యారెక్టర్ని ఏ స్థాయిలో తీర్చిదిద్దారో కొరటాల చిన్న హింట్ ఇచ్చారు.
`యుద్ధం తధ్యం అయితే కత్తి కన్నీళ్లు పెట్టినా కనికరించకు.. సమయం యుద్దాన్ని కోరినప్పుడు ప్రకృతి తన సారథిని పంపిస్తుంది.జ ప్రకృతి కోరలను బలిచ్చే ధీరుడి ప్రచండ దాడికి సిద్ధం..` అంటూ సాగే పవర్ ఫుల్ డైలాగ్‌లు గత కొన్ని రోజులుగా నెట్టింట వైరల్‌గా మారి కొరటాల పెన్ను పదునుకున్న పవర్‌ని తెలియజేస్తూనే ఎన్టీఆర్ ఫెరోషియస్ క్యారెక్టర్లో హైవోల్టేజ్ కథతో రాబోతున్నాడని స్పష్టం చేస్తున్నాయి. మోషన్ పోస్టర్లోనే అదరిపోయే డైలాగ్‌లని అందించిన సరికొత్త ఎన్టీఆర్‌ని, అతని అసలు సిసలైన ఉగ్రావతారాన్ని ఈ సినిమాలో చూపించనున్నానని తెలియజేశారు.
హాలీవుడ్ టెక్నిషియన్స్‌తో..
ప్రతీ విషయంలోనూ రాజీపడకుండా టెక్నికల్‌గానూ ఎన్టీఆర్ సినిమా హై స్టాండర్డ్స్‌లో ఉండేలా దర్శకుడు కొరటాల శివ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆర్టిస్ట్‌లు, టెక్నిషియన్స్, స్టోరీ, బడ్జెట్.. ఇలా ప్రతీదీ పర్ ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకున్నారు. అంతే కాకుండా ఎన్టీఆర్ 30వ సినిమా కావడం, ఆర్ ఆర్ ఆర్ వంటి సంచలన చిత్రం తరువాత చేస్తున్న మూవీ కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని హాలీవుడ్ టెక్నీషియన్లకు కీలక బాధ్యతలు అప్పగించారు. హాలీవుడ్ టాప్ బ్లాక్ బస్టర్స్ ఆక్వామెన్, జస్టిస్ లీగ్, బ్యాట్‌మెన్ వర్సెస్ సూపర్ మెన్ వంటి సంచలన చిత్రాలకు వర్క్ చేసిన బ్రాండ్ మిన్నించ్ ఈ సినిమాకు వీఎఫ్ ఎక్స్ పర్యవేక్షకుడిగా వ్యవహరిస్తున్నారు.
హై వోల్టేజ్ యాక్షన్ ఘట్టాలకు అత్యంత ప్రాధాన్యత ఉన్న సినిమా కావడంతో దీనికి కూడా హాలీవుడ్ యాక్షన్ సూపర్వైజర్ కెన్నిబేట్స్ ని తీసుకున్నారు. ఈయన ట్రాన్స్ ఫార్మర్స్, మిషన్ ఇంపాజిబుల్, సాహో, 2.0 వంటి సినిమాలకు వర్క్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్‌లు తెరకెక్కించే సమయంలో కొరటాల ఓ బ్లడ్ ట్యాంక్‌ని మెయింటైన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అంటే సినిమాలో హింస, పోరాట ఘట్టాలు ఎవరూ ఊహించని విధంగా ఉండనున్నాయన్నమాట. మే 18 సాయంత్రం మేకర్స్ ఓ ప్రీ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. కర్తంతో తడిసిన పదునైన కత్తి.. వెనకాలే ఓ తెప్పలాంటి పడవపై కుల్లబొడిచిన శవాల కుప్ప.. ఒళ్లుగగుర్పొడిచేలా ఉంది.
ఐదు కోట్లు డిమాండ్ చేసిన జాన్వీ..
అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. చాలా కాలంగా తెలుగులో సినిమా చేస్తానంటూ చెప్పుకొచ్చిన జాన్వీ కపూర్ ఏ నిర్మాత, దర్శకుడు ఆఫర్ ఇచ్చినా డేట్స్ లేవుంటూ కుంటి సాకులు చెబుతూ తప్పించుకుంటూ వచ్చింది. విజయ్ దేవరకొండ `లైగర్` విషయంలోనూ ఇదే తరహాలో వ్యవహరించి పూరి జగన్నాథ్‌కు షాకివ్వడం, ఆ తరువాత తను కరణ్ జోహార్ రికమండేషన్‌తో అనన్యపాండేని ఫైనల్ చేసుకోవడం.. `లైగర్` డిజాస్టర్ కావడం తెలిసిందే. ఇంత మందికి నో చెబుతూ వచ్చిన జాన్వీ కపూర్ ఫైనల్‌గా ఎన్టీఆర్ సినిమాకు ఓకే చెప్పేసింది. కారణం ఈ సినిమాకు జాన్వీ 5 కోట్లు డిమాండ్ చేసిందట. ఆ మొత్తం మేకర్స్ ఇవ్వడంతో వెంటనే ఓకే చెప్పిందని తెలిసింది. ఈ సినిమాతో సైఫ్ అలీఖాన్ కూడా టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు. ప్రకాష్‌రాజ్, శ్రీకాంత్ తో పాటు ప్రముఖ నటీనటులు ఇందులో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు రత్నవేలు సిమాటోగ్రాఫర్.
మనుషులకంటే మృగాలు ఎక్కువ…
విస్మరణకు గురైన ఓ తీర ప్రాంత బ్రాక్ డ్రాప్ లో దీన్ని రూపొందిస్తున్నామని కొరటాల శివ ఈ సినిమా ప్రారంభోత్సవంలో చెప్పారు. ఈ కథలో మనుషుల కంటే ఎక్కువగా మృగాళ్లు వుంటారు. భయం అంటే ఏమిటో వాళ్లకు తెలియదు. చావు అంటే భయం లేదు. కానీ.. వాళ్లకు ఒకే ఒక్కటంటే భయం. ఆ భయమేంటో మీకు తెలిసే వుంటుంది. ఇదే ఈ సినిమా బ్రాక్ డ్రాప్ అని సస్పెన్స్ ను కంటెన్యూ చేశారు. భయం ఉండాలి. భయం అవసరం. భయపెట్టడానికి ప్రధాన పాత్ర ఏ స్థాయికి వెళుతుందనేది.. ఒక ఎమోషనల్ రైడ్. దీన్ని భారీ స్థాయిలో తీసుకువస్తున్నామని, నా కెరీర్ లో ఇది బెస్ట్ అవుతుందని అందరికీ మాటిస్తున్నానని తెలిపారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు.