#NTR30FirstLook:యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) నటిస్తున్న 30వ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని ఎన్టీఆర్ అభిమానులు కొన్ని రోజులుగా వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.
#NTR30FirstLook:యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) నటిస్తున్న 30వ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని ఎన్టీఆర్ అభిమానులు కొన్ని రోజులుగా వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆ సమయం రానే వచ్చింది. ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలు శనివారం జరగనున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి 7:02 గంటలకు టైటిల్‌తో పాటు ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్ని మేకర్స్ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. ముందు నుంచి ప్రచారం అవుతున్న `దేవర`(Devara) టైటిల్‌ని ఫైనల్ చేశారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని ఈ భారీ పాన్ ఇండియా మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా పరిచయం అవుతుండగా సైఫ్ అలీఖాన్ పవర్ ఫుల్ విలన్‌గా కనిపించనున్నారు. శ్రీకాంత్, ప్రకాష్‌రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నారు. హాలీవుడ్ టాప్ బ్లాక్ బస్టర్స్ ఆక్వామెన్, జస్టిస్ లీగ్, బ్యాట్‌మెన్ వర్సెస్ సూపర్ మెన్ వంటి సంచలన చిత్రాలకు వర్క్ చేసిన బ్రాండ్ మిన్నించ్ ఈ సినిమాకు వీఎఫ్ ఎక్స్ పర్యవేక్షకుడిగా వ్యవహరిస్తున్నారు.
హై వోల్టేజ్ యాక్షన్ ఘట్టాలకు అత్యంత ప్రాధాన్యత ఉన్న సినిమా కావడంతో ట్రాన్స్ ఫార్మర్స్, మిషన్ ఇంపాజిబుల్, సాహో, 2.0 వంటి సినిమాలకు వర్క్ చేసిన హాలీవుడ్ యాక్షన్ సూపర్వైజర్ కెన్నిబేట్స్ ని తీసుకున్నారు. సినిమాకు సంబంధించిన ఏ చిన్ని విషయంలోనూ రాజీపడకుండా అత్యున్నత ప్రమాణాలతో దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ `ఆర్ ఆర్ ఆర్` వంటి సంచలన చిత్రం తరువాత చేస్తున్న సినిమా కావడంతో ఆ స్థాయికి మించి ఈ చిత్రాన్ని పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు.
శుక్రవారం విడుదల చేసిన ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్లో ఎన్టీఆర్ సముద్రపు అంచున ఎగసిపడే అలల మధ్య ఫెరోషియస్‌గా కనిపిస్తూ కళ్లతో నిప్పులు కురిపిస్తున్నా. బ్లాక్ లుంగీ, బ్లాక్ కలర్ హాఫ్ షర్ట్..మాసిన గడ్డం..చెవులకు పోగులు..మెడలో రుద్రాక్ష..ఒళ్లంతా రక్తం.. ఎడమ చేతిలో రక్తంతో తడిసి ముద్దైన బరిసెలాంటి పదునైన కత్తి.. కాళ్లకు కడియాలు..బ్లాక్ సైండీల్స్..కాళ్ల కింద ఊచ కోతకు గురై విగత జీవులుగా పడి వున్న మృత దేహాలు..కత్తులతో సావాసం చేసే యోధుడిలా వారి మధ్య ధీరత్వంతో ఎన్టీఆర్ కనిపిస్తున్న తీరు రోమాంచితంగా ఉంది.
ఫస్ట్ లుక్ కు ముందు నుంచి కత్తులతో రిలీజ్ టైమ్‌ని చెబుతూ వచ్చిన చిత్ర బృందం టైటిల్‌ని కత్తులతో డిజైన్ చేయించి సినిమాలో ఏ స్థాయిలో హై వోల్టేజ్ యాక్షన్ ఘట్టాలు ఉంటాయన్నది స్పష్టం చేశారు. పోర్ట్ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని ముందు నుంచి చెబుతున్నారు. దానికి అనుగుణంగానే ఫస్ట్‌లుక్‌ని పోర్ట్ ఏరియా నేపథ్యంలో విడుదల చేశారు. పక్కా మాసీవ్ క్యారెక్టర్లో ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ. మలయాళ. కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
#Devara pic.twitter.com/bUrmfh46sR
— Jr NTR (@tarak9999) May 19, 2023