ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. మరో రెండు రోజుల్లోనే ఎదురవుతుంది అని పాట పాడుకుంటున్నారు ఎన్టీఆర్ ఫాన్స్.
ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. మరో రెండు రోజుల్లోనే ఎదురవుతుంది అని పాట పాడుకుంటున్నారు ఎన్టీఆర్ ఫాన్స్. ఎందుకంటే మే 19 న ఎన్టీఆర్ 30 నుంచి అప్డేట్ రానుంది. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఎన్టీఆర్ 30. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఎప్పటినుంచో మే 19 న ఈ సినిమా టైటిల్ తో పాటు ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మే 19 న ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో.. దానికోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక ఆరోజే స్పెషల్ సర్ ప్రైజ్ ఉందని మేకర్స్ చెప్పుకొచ్చారు.
సముద్రం నిండా అతని కథలే.. రక్తంతో రాసినవి అనే క్యాప్షన్ తో ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో సముద్రపు ఒడ్డున పేర్చిన కత్తులు.. వాటికి అంటుకొని రక్తం కనిపిస్తున్నాయి. ఈ ఒక్క పోస్టర్ చాలు.. కొరటాల, ఎన్టీఆర్ ను ఏ రేంజ్ లో చూపించబోతున్నాడు అనేది. ఇక ఈ సినిమాకు దేవరా అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ పోస్టర్ చూసాక ఎప్పుడెప్పుడు తారక్ ఫస్ట్ లుక్ వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.