NTR: దాని కోసం రోజుకు 7సార్లు తినేవాడిని..
Ntr Talking About His Hard Work In RRR: టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ గా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. గతేడాది మార్చి లో రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు పరిశ్రమను ఓ రేంజ్ లో నిలబెట్టింది. ఇక ఇటీవలే ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్స్ లో అవార్డు దక్కించుకుంది. త్వరలో ఈ సినిమా ఆస్కార్ అవార్డు కూడా అందుకుంటుంది అనడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు అందుకోవడానికి కాలిఫోర్నియా వెళ్లిన ఆర్ఆర్ఆర్ చిత్రబృందం అక్కడ అవార్డ్ ను అందుకోవడంతో పాటు ఇంటర్నేషనల్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు.
ఇక తాజాగా వైరైటీ మ్యాగజైన్ కు ఎన్టీఆర్, చరణ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో తారక్.. కొమరం భీమ్ పాత్ర గురించి తాను ఎంత కష్టపడ్డాడో చెప్పుకొచ్చాడు. ” ట్రిపుల్ అర్ కోసం మేము చాలా కష్టపడ్డాం. ముఖ్యంగా ఫిట్ నెస్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాలేదు. ఫిజిక్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. కొన్ని నెలల పాటు ఒకే ఫిజిక్ మెయింటైన్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అందుకోసం రోజుకు ఏడుసార్లు తినేవాడిని.. అలా రోజుకు 3000 క్యాలరీలు పెంచుకొనే వాడిని. భీమ్ లుక్ రావడం కోసం దాదాపు ఏడాది సమయం పట్టింది. ఇప్పుడు ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది” అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.