NTR Devara:`ఆర్ ఆర్ ఆర్` వంటి పాన్ ఇండియా సినిమా తరువాత యం్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న హై వోల్టేజ్‌యాక్షన్ ఎంటర్ టైనర్ `దేవర`. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో యువ సుధా ఆర్ట్స్ బ్యానర్‌పై సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ఇది.
NTR Devara:`ఆర్ ఆర్ ఆర్` వంటి పాన్ ఇండియా సినిమా తరువాత యం్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న హై వోల్టేజ్‌యాక్షన్ ఎంటర్ టైనర్ `దేవర`. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో యువ సుధా ఆర్ట్స్ బ్యానర్‌పై సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ఇది. ఎన్టీఆర్, కొరటాల శివలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలిచిన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. శ్రీదేవి ముద్దుల కూతురు, బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.
సైఫ్ అలీఖాన్ కరుడు గడ్డిన విలన్‌గా కనిపించనున్న ఈ సినిమాలోని ఇతర కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ నటిస్తున్నారు. `ఆర్ ఆర్ ఆర్` తో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్‌ల జాబితాలో చేరిపోయారు. ఈ నేపథ్యంలోనే `దేవర`ని ప్రత్యేకంగా చూస్తున్నారు. ప్రతి విషయంలో సినిమా హైలో ఉండాలని దర్శకుడు కొరటాల పక్కాగా ప్లాన్ చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమా కోసం పలువురు హాలీవుడ్ టెక్నీషియన్‌లని రంగంలోకి దించేశారు. స్పెషల్ ఎఫెక్స్ట్, యాక్షన్ సన్నివేశాలని హాలీవుడ్ టెక్నీషియన్‌లకు అప్పగించారు.
`ఆచార్య` షాక్‌తో `దేవర` ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం ఏడాది సమయం తీసుకున్న కొరటాల ఒక్కో షెడ్యూల్‌ని జెట్ స్పీడుతో పూర్తి చేస్తూ వస్తున్నారు. సినిమా షూటింగ్ మొదలు పెట్టి మూడు నెలలు పూర్తి కాకుండానే కీలక ఘట్టాలకు సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేయడం విశేషం. సముద్ర పరివాహక ప్రాంతం నేపథ్యంలో సాగే కథ కావడంతో ముందుగా సముద్రంపై సాగే కీలక ఘట్టాలని పూర్తి చేశారు. అంతే కాకుండా వీటికి భారీ స్థాయిలో సీజీ వర్క్ అవసరం ఉంటుంది కాబట్టి, దానికి చాలా సమయం పడుతుందని ముందే గ్రహించి ముందుగా ఆ సన్నివేశాలనే పూర్తి చేస్తూ వస్తున్నారు.
ఇప్పటికే విడుదల చేసిన ఎన్టీఆర్ లుక్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తూ ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాని క్లారిటీ ఇచ్చేసింది. త్వరలో అండర్ వాటర్ నేపథ్యంలో సాగే కీలక ఘట్టాలని షూట్ చేయబోతున్నారట. అయితే ఇందు కోసం ఎన్టీఆర్‌కు ప్రత్యేక శిక్షణ అవసరమని హాలీవుడ్ టెక్నీషియన్‌లు సలహా ఇవ్వడంతో ఎన్టీఆర్ ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. `ఆచార్య` ఫ్లాప్‌తో కసితో ఉన్న కొరటాల ఈ సినిమా కోసం కనీవినీ ఎరుగని రీతిలో యాక్షన్ సన్నివేశాలని డిజైన్ చేయించారట. అవి తెరపై రోమాంచితంగా ఉంటాయని, అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది.
ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసిన వెంటనే ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ `వార్ 2` కోసం ముంబై వెళ్లబోతున్నారు. దీంతో `దేవర` షూటింగ్‌ని పరుగులు పెట్టిస్తున్నారట. `జనతా గ్యారేజ్` వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత కొరటాల, ఎన్టీఆర్ కలిసి చేస్తున్న `దేవర` ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.