Pawan Kalyan: పవన్ ను టార్గెట్ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్
NTR Fans Trolled By Pawan Kalyan: సాధారణంగా హీరోల మధ్య ఫ్యాన్స్ వార్ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ మధ్య అవి కాస్తా ముదిరినట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ పరంగా వెళ్తున్నట్లు కనిపిస్తున్నాయి. విషయం ఏంటంటే.. మొదటి నుంచి రామ్ చరణ్- ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య యుద్దాలు జరుగుతున్న విషయం తెల్సిందే. మా హీరో గొప్ప అంటూ మా హీరో గొప్ప అని కొట్టుకుంటూనే ఉన్నారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా వీరికి ఇంకా ఆజ్యం పోసింది. మా హీరో బాగా చేశాడు అంటే.. మా హీరో బాగా చేశాడు. మా హీరోకు అన్యాయం చేశారు అని సోషల్ మీడియాను షేక్ చేసేశారు. ఇక ఇప్పుడిప్పుడే ఈ ఫ్యాన్స్ చల్లబడ్డారు అనుకుంటే అందులోకి పవన్ కళ్యాణ్ వచ్చి మళ్లీ వారిని రెచ్చగొట్టాడు.
ఇటీవల పవన్ కల్యాణ్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల ఈవెంట్ లో రామ్ చరణ్ పాల్గొనడంతో రామ్ చరణ్ కు అభినందనలు తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెల్సిందే. అందులో చరణ్ ను, చిత్ర బృందంను ప్రశంసించాడే కానీ తారక్ పేరును ప్రస్తావించలేదు. అంతకుముందు చిరంజీవి సైతం ఇదే విధంగా చెప్పుకొచ్చాడు. సినిమాలో ఇద్దరూ ఒకే స్థాయిలో కనిపించినప్పటికీ.. పవన్ ఆయన పేరు ప్రస్తావించకపోవడం బాధ కల్గిస్తోందంటూ చాలా మంది ఎన్టీఆర్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. దీంతో పవన్ పై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాల పరంగానే కాకుండా రాజకీయ పరంగా కూడా పవన్ పై ట్రోల్స్ చేస్తున్నారు. ఒక సినిమా విషయంలోనే నీ అన్న కొడుకుకు మద్దతు పలికి.. మిగతా వారిని మర్చిపోయావ్.. రేపు సీఎం అయితే ప్రజలందరినీ ఒకే విధంగా చూస్తావా..? అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ చర్చ నెట్టింట యమా జోరుగా సాగుతోంది. మరి ఈ విషయమై పవన్ ఏమైనా సమాధానం ఇస్తాడేమో చూడాలి.