NTR: అంత అవమానం ఎలా తట్టుకుంటున్నావ్ భయ్యా..
Ntr Fans Fire On Balakrishna: నందమూరి కుటుంబం పైకి ఎంత మంచిగా కలిసి ఉన్నా.. వారిలో వారికే గొడవలు ఉన్నాయి అన్న విషయం అందరికి తెల్సిందే. ముఖ్యంగా ఎన్టీఆర్ ను వారసుడిగా నందమూరి కుటుంబం అంగీకరించదని కూడా తెలుసు. ఎందుకంటే.. ఎన్టీఆర్.. నందమూరి హరికృష్ణ రెండో భార్య కుమారుడు. దీంతో అతనికి.. నందమూరి కుటుంబంలో ఎంట్రీ లేదని చెప్పుకొస్తారు. తారక్ ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఆ కుటుంబంలో మాత్రం అతను ఎప్పుడు పరాయివాడే అని ఇండస్ట్రీలో చాలామంది చెప్పుకొస్తారు. ఇక బాలకృష్ణ సైతం ఎన్టీఆర్ ను పక్కన పెడతాడని ఎన్నోసార్లు నిరూపితమయ్యిందే. అయితే హరికృష్ణ మృతి చెందాకా.. ఎన్టీఆర్ ను బాలయ్య దగ్గరకు తీసుకున్నాడు. తండ్రి స్థానంలో ఉంటానని చెప్పుకొచ్చాడు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరోసారి బాలయ్య, ఎన్టీఆర్ ను అవమానించాడంటూ అభిమానులు రచ్చ చేస్తున్నారు.
నందమూరి తారకరత్న పెద్ద కర్మ నిన్న ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో జరిగిన విషయం తెల్సిందే. అక్కడకు నందమూరి కుటుంబం మొత్తం హాజరయ్యింది. ఇక వచ్చిన వారందరిని పలకరించిన బాలయ్య.. ఎన్టీఆర్ ను మాత్రం పట్టించుకోలేదు. కనీసం బాలయ్య ముందు ఎన్టీఆర్ నిలబడినా చూసి చూడనట్టు ముఖం తిప్పుకొని వెళ్ళిపోయాడు. దీంతో అభిమానులు బాలయ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ను ఎందుకు అంత అవమానిస్తున్నారు.. అసలు ఎలా ఉంటున్నావ్ భయ్యా అలాంటి అవమానాలను తట్టుకొని అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.