Nora Fatehi: బాలయ్య సినిమాలో హాట్ బ్యూటీ.. విలన్ గానా..?
Nora Fatehi Play A Key Role In NBK 108: వీరసింహారెడ్డి సినిమా తరువాత బాలయ్య, అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK 108 చేస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో బాలయ్య తండ్రి పాత్రలో కనిపించనుండగా.. కూతరుగా యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటుంది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అందుకుకారణం.. అనిల్ రావిపూడి అంతకు ముందు సినిమాలే.. హీరోలతో కామెడీ చేయించి హిట్ కొట్టడం అనిల్ కు అలవాటు. మరీ బాలయ్యతో కామెడీ అంటే మాటలు కాదు.. అయితే అనిల్ మాత్రం బాలయ్య ఫ్యాన్స్ విజిల్ వేసేలా సినిమాను డిజైన్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో ఈ చిత్రం ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమా గురించిన ఒక న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ చిత్రంలో మనోహరి బ్యూటీ నోరా ఫతేహి నటిస్తుందట. నోరా అనగానే హాట్ ఐటెంసాంగ్ నా అని అనుకోకండి.. అమ్మడు విలన్ గా కనిపిస్తోందట. ఈ పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉండనున్నాయని, పాత్ర నచ్చడంతో నోరా కూడా ఓకె చెప్పిందని టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తలు నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.