Niharika:టాలీవుడ్ యంగ్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) త్వరలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripati)ని వివాహం చేసుకోనున్నారని, జూన్‌లో వీరి నిశ్చితార్థం జరగనుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
Niharika:టాలీవుడ్ యంగ్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) త్వరలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripati)ని వివాహం చేసుకోనున్నారని, జూన్‌లో వీరి నిశ్చితార్థం జరగనుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా వీరిపై పుకార్లు షికారు చేశాయి. సీక్రెట్‌గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారని, త్వరలో పెళ్లంటూ వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఎంగేజ్మెంట్ జరగలేదని తెలిసింది. తాజాగా వీరిపై మళ్లీ పెళ్లి వార్తలు మొదలయ్యాయి.
వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లికి ఇరు కుటుంబాల వారు ఓకే చెప్పేశారని, జూన్‌లో నిశ్చితార్థం జరగనుందంటూ కొత్తగా ప్రచారం మొదలైంది. ఈ వార్తలపై తాజాగా నిహారిక స్పందించింది. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వరుణ్, లావణ్యల నిశ్చితార్థం జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో ఉన్న నిజమెంత? అని నిహారికని అడిగితే షాకింగ్ కామెంట్లు చేసింది.
ఈ వార్తలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. `ఇప్పుడు దాని గురించి మాట్లాడాలనుకోవడం లేదు. కేవలం `డెడ్ పిక్సెల్` గురించే చర్చించాలకుంటున్నాను` అని సమాధానం చెప్పింది. మరో ఛానల్లో మాట్లాడుతూ తనపై వస్తున్న పుకార్లపై ఘాటుగా స్పందించింది. `మన చుట్టూ ఎంతో మంది మూర్ఖులుంటారు. అటెన్షన్ కోసం మరీ మూర్ఖంగా మారుతున్నారు. అలాంటి వాళ్లను పట్టించుకోకుండా ఉండటమే మంచిదన్నారు.
అంతే కాకుండా నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో ఓ ఫంక్షన్లో కాలుమీద కాలు వేసి కూర్చున్నాను. నా డ్రెస్ ఇబ్బందిగా ఉండటం వల్లే అలా కూర్చోవాల్సి వచ్చింది. అప్పుడు నా పక్క సీట్లో పెద్ద వ్యక్తి ఎవరో కూర్చున్నారు. అది చూసి కొంత మంది నాపై విమర్శలు చేశారు. వాళ్ల మాటలకు అప్పట్లో బాధపడ్డాను. అయితే ఇప్పుడు అలాంటి వాటిని పట్టించుకోవడం లేదు` అంటూ తెలిపింది నిహారిక.
కొంత విరామం తరువాత కొణిదెల నిహారిక మళ్లీ కెమెరా ముందుకొచ్చారు. ఆమె నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ `డెడ్ పిక్సెల్స్`. అక్షయ్ పుల్ల కథ అందించగా అక్షయ్ మందల ఈ సిరీస్‌ని రూపొందించారు. బీబీసీ స్టూడియోస్ ఇండియన్ ప్రై.లి., తమడ మీడియా బ్యానర్లపై సమీర్ గోగటే, సాయిదీప్ బొర్రా, రాహుల్ తమడా సంయుక్తంగా ఈ సిరీస్ ను నిర్మించారు. మే 19 నుంచి ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.