Varalaxmi Sarathkumar:తమిళ హీరో శరత్ కుమార్ వారసురాలిగా సినిమాల్లోకి ప్రవేశించారు నటి వరలక్ష్మీ శరత్ కుమార్. అనతి కాలంలోనే తండ్రిని మించిన తనయగా విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు. తెలుగులో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన `క్రాక్` మూవీలో వరలక్ష్మి పోషించిన జయమ్మ క్యారెక్టర్ తనకు ఏ స్థాయి గుర్తింపుని తెచ్చి పెట్టిందో అందరికి తెలిసిందే.
Varalaxmi Sarathkumar:తమిళ హీరో శరత్ కుమార్ వారసురాలిగా సినిమాల్లోకి ప్రవేశించారు నటి వరలక్ష్మీ శరత్ కుమార్. అనతి కాలంలోనే తండ్రిని మించిన తనయగా విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు. తెలుగులో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన `క్రాక్` మూవీలో వరలక్ష్మి పోషించిన జయమ్మ క్యారెక్టర్ తనకు ఏ స్థాయి గుర్తింపుని తెచ్చి పెట్టిందో అందరికి తెలిసిందే. తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో నటిగా మంచి గుర్తింపుతో పాటు క్రేజీ ఆఫర్లని దక్కించుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతోంది.
ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో క్రేజీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న వరలక్ష్మీ శరత్ కుమార్ సడన్‌గా ఎన్ ఐ ఏ అధికారులు షాక్ ఇచ్చారు. డ్రగ్స్ కేసుకు సంబంధించిన కొచ్చి అధికారులు వరలక్ష్మికి నోటీసులు జారీ చేశారు. చాలా ఏళ్లుగా వరలక్ష్మీకి పీఏగా పని చేస్తున్న ఆదిలింగం అనే వ్యక్తి డ్రగ్స్ కేసులో కీలక నిందితులలో ఒకరిగా చెలామణి అవుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఆయపనకు అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్‌లతో సంబంధాలు ఉన్నట్టు పోలీసులకు పక్కా ఆధారాలు లభించాయి.
దీంతో వరలక్ష్మీ పీఏ ఆదిలింగంను ఎన్ ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారించడం మొదలు పెట్టారట. డ్రగ్స్ సరఫరా ద్వారా వచ్చిన మొత్తాన్ని సినీ ఇండస్ట్రీలోనే పెట్టుబడులుగా పెట్టినట్టు ఎన్ ఐఏ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆదిలింగంకు సంబంధించిన పూర్తి వివరాల విచారణ కోసం నటి వరలక్ష్మీ శరత్ కుమార్‌కు తాజాగా ఎన్ ఐఏ అధికారులు నోటీసులు జారీ చేసినట్టుగా తెలిసింది. వరలక్ష్మికి పీఏగా పని చేసిన ఆదిలింగం ఆమెకు డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా ఎన్ ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు.
అంతే కాకుండా ఆదిలింగం డ్రగ్స్ ద్వారా వచ్చిన మొత్తాన్ని సినీ పరిశ్రమలో పెట్టుబడులుగా పెట్టడంలో వరలక్ష్మి అతనికి సహకరించి ఉండవచ్చనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. వరలక్ష్మితో పాటు ఆదిలింగం కోలీవుడ్‌లో ఎవరితో టచ్‌లో ఉన్నారు? ..ఎవరితో అత్యంత సన్నిహితంగా వ్యవహరించారు? అనే వివరాలని తెలుసుకునే పనిలో ఎన్ ఐఏ అధికారులు ఇప్పటికే పరిశోధన మొదలు పెట్టినట్టుగా కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.