నరేష్, పవిత్రా లోకేష్ జంటగా ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మళ్లీ పెళ్లి. తన జీవితంలో జరిగిన కొన్ని వాస్తవాఇక సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు నరేష్ చెప్పుకొస్తున్నారు.
నరేష్, పవిత్రా లోకేష్ జంటగా ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మళ్లీ పెళ్లి. తన జీవితంలో జరిగిన కొన్ని వాస్తవాఇక సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు నరేష్ చెప్పుకొస్తున్నారు. ఇక ఈ సినిమాను ఆయనే నిర్మించడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మరో లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. కావేరి గాలిలా… అంటూ సాగే ఈ గీతం ఎంతో ఆహ్లాదంగా ఉంది. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ గీతానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. నరేష్ అయ్యర్ తన గాత్రంతో సాంగ్ కు ప్రాణం పోశారు.
మొట్టమొదటిసారి నరేశ్- పవిత్ర కలుసుకున్నప్పుడు నరేష్ లో పుట్టిన ప్రేమ భావాల సమూహారమే.. ఈ సాంగ్. ఈ పాటలో నరేష్, పవిత్ర లోకేష్ ల కెమిస్ట్రీ బ్యూటీఫుల్ గా వుంది. ఇక ఈ చిత్రంలో నరేష్, పవిత్రా లోకేష్ పరిచయం ప్రేమగా ఎలా మారింది? టాపిక్ నుంచి ‘మా’ ఎలక్షన్స్, బెంగళూరు ఎపిసోడ్ & మూడో భార్యను ఆయన కాలి మీద తన్నడం వరకు ‘మళ్ళీ పెళ్లి’ సినిమాలో చూపించనున్నారు. నిజం చెప్పాలంటే.. ఈ సినిమాలో రిలీజ్ అయినా ప్రతి సాంగ్ చార్ట్ బస్టర్ గా మారింది. ఇకపోతే ఈ చిత్రం మే 26 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో నరేష్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.