Manchu Manoj: ఏదేమైనా ఈ విషయంలో నువ్వు చాలా గ్రేట్ బాసూ
Netizens Praises Manchu Manoj: సాధారణంగా ఒక అమ్మాయిని తమ జీవితంలోకి ఆహ్వానించడం ఒక ఆ అబ్బాయికి పెద్ద విషయం.. అలాంటింది.. ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి అయ్యి, ఒక కొడుకు కూడా ఉంటే.. ఆ ఇద్దరినీ కూడా అంగీకరించి తమ జీవితంలోకి ఆహ్వానించడం గొప్ప విషయం. ఇందులో మంచు మనోజ్ నిజంగా గొప్పవాడని చెప్పాలి అంటున్నారు అభిమానులు. మంచు మనోజ్ భూమా మౌనిక పెళ్లితో ఒక్కటైన సంగతి తెలిసిందే.మార్చి 3వ తేదీన మంచు లక్ష్మి ఇంట్లో మనోజ్ మౌనికల పెళ్లి జరిగింది. వీరి మ్యారేజ్‌కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక పెళ్లి తరువాత మనోజ్ అభిమానులతో పంచుకున్న ఫోటో ఒకటి నెటిజన్స్ ను ఆకట్టుకొంటుంది.
మనోజ్ చేతిలో మౌనిక చేతులు.. వారిద్దరి చేతుల మధ్య మౌనిక కుమారుడు చేతులు ఉన్నాయి. ముగ్గురు ఒకరి చేతులు ఒకరు పట్టుకున్న ఆ ఫోటోను షేర్ చేస్తూ శివుని ఆజ్ఞ అని క్యాప్షన్ గా పెట్టుకొచ్చాడు మనోజ్.ఇక నుంచి వీరిద్దరి బాధ్యతను శివుడు తనకు అప్పగించాడని మనోజ్ చెప్పకనే చెప్పుకొచ్చాడు. ఎవరైనా రెండో వివాహం చేసుకున్న సమయంలో భార్యకి పిల్లలు ఉంటే వారిని యాక్సప్ట్ చేయడానికి ఇష్టపడరు. కాని మంచు మనోజ్ మాత్రం ఈ విషయంలో స్పెషల్ అని నిరూపించుకున్నాడు. దీంతో నెటిజన్స్ మనోజ్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ విషయంలో నువ్వు నిజంగా గ్రేట్ బాసూ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.