Keerthy Suresh: ఇంత తెలివి తక్కువగా ఎలా ఆలోచించావ్ కీర్తి..?
Netizens Trolling Keerthi Suresh: మహానటి చిత్రం తరువాత కీర్తి సురేష్ అంతటి హిట్ ను అందుకున్నదే లేదు. స్టార్ల సరసన నటించినా.. లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేసినా విజయం మాత్రం అమ్మడికి ఆమడదూరంలో ఉంటోంది. ఇక ఇటీవల ఆమె నటించిన సర్కారువారి పాట చిత్రం హిట్ టాక్ తెచ్చుకున్నా అదంతా మహేష్ ఖాతాలోకి పోయింది. అయినా ఈ సినిమాతో కీర్తికి కొద్దిగా ఊరట లభించింది. ప్రస్తుతం ఈమె తెలుగులో చిరంజీవికి సోదరిగా `భోళా శంకర్` నానికి జోడీగా `దసరా` చిత్రాలు చేస్తోంది. అలాగే మలయాళ తమిళ్ భాషల్లోనూ పలు ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఇక కోలీవుడ్ లో ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన చిత్రం పొన్నియన్ సెల్వన్.
స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్టార్ హీరోలు, హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు ఇటీవలే రిలీజైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కీర్తి సురేష్ కు ఒక మంచి ఆఫర్ వస్తే ఆమె కాదని చెప్పిందంట. అది కూడా కేవలం రజినీకాంత్ సినిమా కోసం. ఆ సమయంలో ఆమె సూపర్ స్టార్ రజనీకాంత్ కు చెల్లెలిగా `అన్నాత్తే(తెలుగులో పెద్దన్న)` చిత్రంలో నటిస్తుందట. రజనీకాంత్ తో నటిస్తే మంచి క్రేజ్ వస్తుందని భావించి.. తనకు డేట్స్ అడ్జస్ట్ కావడం లేదనే కారణంతో కీర్తి `పొన్నియిన్ సెల్వన్`కు నో చెప్పిందట. దీంతో కీర్తి ప్లేస్ లో త్రిషను ఎంపిక చేసినట్లు టాక్ నడుస్తోంది.
ఇక పెద్దన్న కీర్తికి ప్లాప్ ను తెచ్చిపెట్టింది. దీంతో నెటిజన్స్ కీర్తికి ఏకిపారేస్తున్నారు. `పెద్దన్న` వంటి ఫ్లాప్ మూవీ కోసం `పొన్నియిన్ సెల్వన్`ను వదులుకుని కీర్తి సురేష్ తెలివి తక్కువ పని చేసిందని ముఖం మీదే చెప్పేస్తున్నారట. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సిఉంది.