Netflix: ఈ ఏడాది తెలుగుసినిమాలపై కన్నేసిన నెట్ ఫ్లిక్స్
Netflix Announces An Upcoming Line Up Of 16 Exciting Telugu Films: ప్రముఖ ఓటిటీ నెట్ ఫ్లిక్స్ సంక్రాంతికి తెలుగు అభిమానులకు పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. తమ వేదికపై 2023 లో రాబోయే 16 తెలుగు సినిమాల పేర్లు సంక్రాంతి కానుకగా చెప్పుకొచ్చింది. సంక్రాంతి పండుగ సందర్భంగా నెట్ ఫ్లిక్స్ ఈ 16 తెలుగు సినిమాల పేర్లు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ప్రకటించగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఆర్ఆర్ఆర్, శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి వంటి చిత్రాలకి నెట్ ఫ్లిక్స్ లో ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన లభించగా ఈ సంవత్సరం విడుదలయ్యే చిత్రాలకి అంతకు మించి స్పందన రానుందని అర్ధమవుతుంది.
ఇక ఈ సందర్భంగా నెట్ ఫ్లిక్స్ కంటెంట్ వి.పి – మోనికా షెర్గిల్ మాట్లాడుతూ “మా ప్రేక్షకులకి నచ్చే ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ కథలని ప్రేక్షకులకు అందించాలనుకుంటున్నాము. భారీ అంచనాల మధ్య ఈ సంవత్సరంలో విడుదల అయిన తెలుగు చిత్రాలని త్వరలో మా నెట్ ఫ్లిక్స్ లో తీసుకురానుండడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రాల ద్వారా సౌత్ ఇండియాలో పెరుగుతున్న టాలెంట్ ప్రపంచవ్యాప్తంగా తెలియనుంది. అందుకు తగ్గట్టుగా సాంకేతికంగా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నాం” అని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
@sundeepkishan @ANTONfilmmaker @StudioGreen2 @kegvraja @hiphoptamizha @NehaGnanavel @Dhananjayang @apifilms @homescreenent @MangoMassMedia
— Netflix India South (@Netflix_INSouth) January 14, 2023