Nayanathara: పిల్లలతో నయన్ జంట.. చూడచక్కగా ఉన్నారే
Nayanthara, Vignesh Shivan Spotted With Their Twins At Mumbai Airport: కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార, విగ్నేష్ శివన్ గతేడాది ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. అయితే వారు సరోగసి ద్వారా పిల్లలకన్నారు అనే విషయం తెలియడంతో పెద్ద ఎత్తున మరోసారి వివాదం ఏర్పడింది. అయినా భయపడకుండా అన్ని ఆధారాలను చూపించి లీగల్ గా పేరెంట్స్ అయ్యారు. ఇక ట్విన్స్ వచ్చాక నయన్- విగ్నేష్ జీవితాల్లోకి వెలుగు వచ్చింది. ఒక్క క్షణం కూడా వారిని వదిలి ఉండలేకపోతున్నారట ఈ జంట. ఇక ఏ పండుగ వచ్చినా ఈ జంట తమ బిడ్డలతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు.
తాజాగా ఈ జంట తమ పిల్లల ఇద్దరితో కలిసి ముంబై ఎయిర్ పోర్టులో సందడి చేశారు. ఇద్దరు ఇద్దరు పిల్లలను ఎత్తుకొని ఇంకో పక్క లగేజి బ్యాగ్ ను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. సాధారణంగా ప్రముఖుల పిల్లలు అంటే.. బేబీ సిట్టర్లు అడుగడునా ఉంటారు. ఎక్కడికి వెళ్లినా వారి వెంటే వస్తారు. కానీ, నయన్ మాత్రం తన బిడ్డలను ఎంతో జాగ్రత్తగా గుండెలకు హత్తుకొని తీసుకురావడం చాలా విశేషం. వారే తమ ఇద్దరు బిడ్డలను ఎత్తుకొని తీసుకెళ్లడం ఎంతో బావుందని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. ఇకపోతే నయన్ ప్రస్తుతం జవాన్ సినిమాలో నటిస్తుండగా.. విగ్నేష్ మరో సినిమాతో బిజీగా ఉన్నాడు.