Nayatara:స్టార్ హీరోలు ఈ మధ్య కొత్త బిజినెస్‌లోకి ప్రవేశిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ (Allu arjun), సూపర్ స్టార్ మహేష్ (Superstar Mahesh), రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay deverakopnda) మల్టీప్లెక్స్ (Multiplex) రంగంలోకి ప్రవేశించిన సొంతంగా థియేటర్లని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే.
Nayatara:స్టార్ హీరోలు ఈ మధ్య కొత్త బిజినెస్‌లోకి ప్రవేశిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ (Allu arjun), సూపర్ స్టార్ మహేష్ (Superstar Mahesh), రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay deverakopnda) మల్టీప్లెక్స్ (Multiplex) రంగంలోకి ప్రవేశించిన సొంతంగా థియేటర్లని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. అమీర్‌పేట్‌లో అల్లు అర్జున్, గచ్చిబౌలిలో మహేష్, మహబూబ్ నగర్లో విజయ్ దేవరకొండ సొంతంగా మల్టీప్లెక్స్ థియేటర్లని ఏషియన్ సినిమాతో కలిసి ప్రారంభించారు. ఇలా కొత్త బిజినెస్‌లోకి ప్రవేశించారు. వీరి తరహాలోనే లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా మల్టీప్లెక్స్ రంగంలోకి ప్రవేశించనున్నట్టుగా తెలుస్తోంది.
Chennai Agastya Theatre 1
స్టార్ హీరోయిన్గా తమిళ, తెలుగు భాషల్లో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న నయనతార ఇటీవలే కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్‌ని వివాహం చేసుకుని ఇద్దరు కలవల పిల్లలకు తల్లైన విషయం తెలిసిందే. ఇదే ఏడాది `జావాన్` మూవీతో బాలీవుడ్‌కు పరిచయం కానున్న నయనతార కొత్తగా మల్టీప్లెక్స్ థియేటర్స్ రంగంలోకి ప్రవేశించబోతోంది. ఇందు కోసం చెన్నైలోని 56 ఏళ్ల నాటి పురాతన థియేటర్ని కొనుగోలు చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Agastya Theatre 2
ప్రస్తుతం థియేటర్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై నయన్, విగ్నేష్ సన్నిహితులు మాత్రం అలాంటిదేమీ లేదని అంటున్నారు. కానీ ఈ వార్తలపై మాత్రం నయనతార, విగ్నేష్ శివన్ మాత్రం స్పందించడం లేదు. దీంతో ఈ వార్తల్లో నిజముందని, ఆ కారణంగానే విగ్నేష్ స్పందించడం లేదని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడిప్పడే కమర్షియల్ యాడ్లలోనూ మెరుస్తున్న నయనతార చాలా వరకు అనేక వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారట.
Agastya Theatre 3
ఆ జోష్‌తోనే త్వరలో థియేటర్ రంగంలోకి ప్రవేశించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. రౌడీ పిక్చర్స్ సంస్థపై ఇటీవలే నయన్, విగ్నేష్ చెన్నైలోని 56 ఏళ్ల పురాతన థియేటర్‌ను కొనుగోలు చేశారని, ఉత్తర చెన్నై ప్రాంతంలోని దేవి థియేటర్ గ్రూప్‌కు చెందిన అగస్త్య థియేటర్ ఇదని, తమిళ టాప్ స్టార్లైన ఎంజీఆర్,శివాజీ గణేషన్, రజనీకాంత్, కమల్‌హాసన్, విజయ్, అజిత్ ల బ్లాక్ బస్టర్ చిత్రాలకు సాక్ష్యంగా చిలిచిందని, ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్ ని నయనతార దంపతులు సొంతం చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
కరోనాకు ముందు ఓ వెలుగు వెలిగిన ఈ సింగిల్ స్క్రీన్ ఆ తరువాత ఇబ్బందుల్లో పడింది. ఈ నేపథ్యంలోనే ఈ థియేటర్‌ను 2020లో మూసేశారు. ఇదే థియేటర్ని మల్టీప్లెక్స్‌గా మార్చి రెండు స్క్రీన్లుగా చేసి మొత్తం వెయ్యి మంది కెపాసిటీతో మార్పులు చేర్పులు చేసి ఈ ఏడాది ఎండింగ్ లో ప్రారంభించాలని నయన్ దంపతులు ప్లాన్ చేస్తున్నారని చెన్నై సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే నయనతార నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ `జవాన్` సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతోంది. షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి అట్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.