Her Teaser: ఆమెకు సపోర్ట్ గా నిలిచిన అర్జున్ సర్కార్
Natural Star Nani Launched HER Chapter 1 Teaser: చిలసౌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ రుహనీ శర్మ. ఈ సినిమా తరువాత అమందికి బాగానే అవకాశాలు వచ్చాయి కానీ.. స్టార్ స్టేటస్ ను అందుకోలేకపోయింది. హిట్ సినిమాలో తన టాలెంట్ బయటపెట్టి సక్సెస్ అందుకున్న ఈ భామ అదే ఇన్వెస్టిగేషన్ తరహా కథ హార్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటిదాకా సాఫ్ట్ రోల్స్ చేస్తూ ఆకట్టుకున్న ఈ హీరోయిన్, తొలిసారి ఫిమేల్ లీడ్ చేస్తూ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తోంది. డబుల్ అప్ మీడియాస్ సంస్థ ఫస్ట్ ప్రొడక్షన్ గా ఈ సినిమాను రిలీజ్ చేస్తుండగా రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి ఈ సినిమాను నిర్మించారు. శ్రీధర్ స్వరగావ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను న్యాచురల్ స్టార్ నాని రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు. ఇలాంటి పాత్రనే నాని హిట్ 3 లో చేస్తున్నాడు. అర్జున్ సర్కార్ గా నాని హిట్ 2 చివర్లో కనిపించి మెప్పించిన విషయం తెల్సిందే. ఇక టీజర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది.
ఇక ఈ టీజర్ లో రుహనీ శర్మ క్యారెక్టర్ హైలైట్ అయింది. ఆమె ఓ చాలెంజింగ్ రోల్ చేసిందని వీడియో లోని సన్నివేశాలు ప్రూవ్ చేశాయి. డ్యూటీ పరంగా 6 నెలల సస్పెన్షన్ తర్వాత ఓ హత్య కేసును ఛేదించడానికి తిరిగి ఖాకీ డ్రెస్ ధరించిన రుహనీ శర్మ సీన్ తో మొదలైన ఈ టీజర్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. శ్రీధర్ స్వరగావ్ రూపుదిద్దిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ పై ఒక్కసారిగా అంచనాలు రెట్టింపయ్యాయి.విష్ణు బేసి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. చాణక్య తూరుపు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. మరి ఈ సినిమాతో ఈ భామ హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.