Naresh: త్వరలో ప్రెస్ మీట్ పెట్టి నా పెళ్లి గురించి చెప్తా
Naresh Talking About His Marriage: టాలీవుడ్ సీనియర్ హీరో నరేష్ పెళ్లి వార్త నెట్టింట వైరల్ గా మారింది. అనేక ట్విస్ట్‌ల మధ్య ఈ ప్రేమ పక్షలు పెళ్లిబంధంతో ఒక్కటైయారు. నరేష్, పవిత్రను పెళ్లి చేసుకున్న వీడియోను రిలీజ్ చేశాడు. ఆ వీడియోకు ఒక పవిత్ర బంధం, రెండు మనుసులు, మూడు ముళ్లు, ఏడడుగులు, మీ ఆశిస్సులు కోరుకుంటూ పవిత్ర నరేష్ అంటూ కాప్షన్ ఇచ్చాడు. దాంతో ఆ వీడియో కూడా క్షణాల్లోనే వైరల్ అయింది. అయితే ఇదంతా ఫేక్ మ్యారేజ్ అని వార్తలు గుప్పుమన్నాయి. ఒక సినిమా కోసం వీరు పెళ్లి షూట్ చేసినట్లు చెప్పుకొస్తున్నారు ఇక తాజగా తన పెళ్లిపై నరేష్ స్పందించాడు. నరేష్ కీలకపాత్రలో నటించిన ‘ఇంటింటి రామాయణం’ ప్రెస్‌మీట్‌లో తన పెళ్లి వీడియోపై మాట్లాడాడు
“ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుంది. రియల్ లైఫ్ వేరు, రీల్ లైఫ్ వేరు. త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తా. అప్పటివరకు ఓపికతో ఉండండి.. కొంచెం నాకు ప్రైవసీ కావాలి” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు ఆ ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారో అని ఎదురుచూస్తున్నారు. ఇక నరేష్- పవిత్ర లవ్ స్టోరీ అందరికి తెల్సిందే. సమ్మోహనం సినిమాలో ఈ జంట మొదటిసారి కలిశారు. అక్కడ పెరిగిన పరిచయం ప్రేమకు దారితీసింది. మరి ఈ జంట నిజమైన పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో చూడాలి.