సీనియర్ నటుడు నరేష్(Naresh), పవిత్ర లోకేష్(Pavitra Lokesh') ఓపెన్ రిలేషన్షిప్.. ఇప్పటికీ ఇంటస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఎంత రచ్చ చేసినా.. నరేష్ కుటుంబ సభ్యులు ఎవరూ మీడియా ముందు రియాక్టవలేదు. అయితే తాజగా నరేష్ కొడుకు నవీన్(Naveen) తన తండ్రి రిలేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Naresh Son Naveen : సీనియర్ నటుడు నరేష్(Naresh), పవిత్ర లోకేష్(Pavitra Lokesh’) ఓపెన్ రిలేషన్షిప్.. ఇప్పటికీ ఇంటస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఎంత రచ్చ చేసినా.. నరేష్ కుటుంబ సభ్యులు ఎవరూ మీడియా ముందు రియాక్టవలేదు. అయితే తాజగా నరేష్ కొడుకు నవీన్(Naveen) తన తండ్రి రిలేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న సత్య(Satya) సినిమాలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Daram Tej) హీరోగా చేస్తున్నాడు. అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది ఈ సినిమా. సత్య మూవీ ప్రమోషన్స్ కోసం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నవీన్(Naveen)కు.. నరేష్-పవిత్ర రిలేషన్ గురించి అనుకోకుండా ప్రశ్న ఎదురైంది.
దీనిపై ..వాళ్లు మాత్రమే అలా రిలేషన్షిప్లో లేరని.. బయట చాలా మంది అలా చేసిన వాళ్లు ఉన్నారని నవీన్(Naveen) చెప్పుకొచ్చాడు. దీనిలో సమాజానికి ఇచ్చే మెసేజ్ ఏం ఏం లేదని అన్నాడు. అంతేకాదు జీవించినంత కాలం ప్రశాంతంగా, ఆనందంగా బతకడమే లక్ష్యంగా ఎవరైనా ఉండాలని నవీన్ చెప్పాడు. అంతేకానీ ఎవరో ఏదో అనుకుంటున్నారని భయపడితే ఎప్పటికీ,ఎవరూ సంతోషంగా జీవించలేరని అన్నాడు.
అయినా నాయనమ్మ విజయనిర్మల తమనెప్పుడూ ఇలా ఉండాలి, అలా ఉండాలని ఎప్పుడూ చెప్పలేదన్నాడు నవీన్(Naveen). తమకు నచ్చినట్లు బతకమని ఫ్రీడమ్ ఇవ్వడంతో..నాన్న కూడా అదే ఫాలో అవుతారని చెప్పాడు. అంతెందుకు తన పెళ్లి కూడా తన ఇష్ట పూర్వకంగానే నాన్న నరేష్ చేసుకోమన్నారని నవీన్ చెప్పాడు. ఆయన వచ్చి కేవలం అక్షింతలు వేసి వెళతానని చెప్పారని అన్నాడు .