నందమూరి నట సింహం బాలకృష్ణ (balakrishna) నేడు తన 63వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. గత వారం ముందు నుంచే బాలయ్య బర్త్ డే(happy birthday NBK) వేడుకలు మొదలైపోయాయి.
నందమూరి నట సింహం బాలకృష్ణ (balakrishna) నేడు తన 63వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. గత వారం ముందు నుంచే బాలయ్య బర్త్ డే(happy birthday NBK) వేడుకలు మొదలైపోయాయి. అభిమానులు ఆయనకు బర్త్ డే కానుకగా గ్లోబల్ లయన్(global lion) అనే బిరుదును కూడా అందించిన విషయం కూడా తెల్సిందే. ఇక నేటి ఉదయం నుంచి బాలయ్య పుట్టినరోజు శుభాకాంక్షలతో సోషల్ మీడియా షేక్ అవుతుంది. అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు.. బాలయ్యకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇక తాజాగా బాలయ్య బావ.. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(nara Chandrababu Naidu).. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
“నటునిగా కళాసేవ… ఎమ్మెల్యేగా ప్రజా సేవ… ఆసుపత్రి నిర్వహణతో సమాజ సేవ చేస్తున్న మా బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మంచి మనసుతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న మీరు… నిండు నూరేళ్లూ ఆనందంతో, ఆరోగ్యంతో వర్థిల్లాలని కోరుకుంటున్నాను… హ్యాపీ బర్త్ డే NBK” అంటూ ట్వీట్ చేస్తూ ఒక ఫోటోను షేర్ చేశారు. ఈ ఫొటోలో చంద్రబాబు.. బాలయ్య కు బోకే ఇస్తున్నట్లు కనిపిస్తుంది. బాలయ్య డ్రెస్సింగ్ స్టైల్ చూస్తుంటే.. ఈ ఫోటో.. బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ షో కు చంద్రబాబు గెస్ట్ గా వచ్చినప్పుడు దిగిన ఫోటో అని తెలుస్తుంది.ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
నటునిగా కళాసేవ… ఎమ్మెల్యేగా ప్రజా సేవ… ఆసుపత్రి నిర్వహణతో సమాజ సేవ చేస్తున్న మా బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మంచి మనసుతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న మీరు… నిండు నూరేళ్లూ ఆనందంతో, ఆరోగ్యంతో వర్థిల్లాలని కోరుకుంటున్నాను.#HappyBirthdayNBK pic.twitter.com/23MRNPDszB
— N Chandrababu Naidu (@ncbn) June 10, 2023