Mokshagna:నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞతేజ ఎప్పుడెప్పుడు హీరోగా తెరంగేట్రం చేస్తాడా? అని అభిమానులు కొంత కాలంగా అమితాసక్తితో ఎదు చూస్తున్నారు. ఈ విషయంపై హీరో నందమూరి బాలకృష్ణ పలు సందర్భాల్లో వెల్లడించారు. త్వరలోనే మోక్షజ్ఞ అరంగేట్రం ఉంటుందని స్పష్టం చేశారు.
Mokshagna:నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞతేజ ఎప్పుడెప్పుడు హీరోగా తెరంగేట్రం చేస్తాడా? అని అభిమానులు కొంత కాలంగా అమితాసక్తితో ఎదు చూస్తున్నారు. ఈ విషయంపై హీరో నందమూరి బాలకృష్ణ పలు సందర్భాల్లో వెల్లడించారు. త్వరలోనే మోక్షజ్ఞ అరంగేట్రం ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ చేయాలని ప్లాన్ చేసిన `ఆదిత్య 999`తో మోక్షజ్ఞ హీరోగా పరిచయం అవుతాడని ప్రచారం జరిగింది. ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడం, మోక్షజ్ఞ బాగా లావు కావడంతో ఇప్పట్లో వారసుడి ఎంట్రీ కష్టమేనా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఇదిలా ఉంటే తాజాగా మోక్షజ్ఞ నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన ఓ వివాహ వేడుకలో స్లిమ్‌గా కనిపించడంతో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడని వార్తలు మొదలయ్యాయి. తాజాగా బాలకృష్ణ నటిస్తున్న `భగవంత్ కేసరి` సెట్లో మోక్షజ్ఞ కనిపించడంతో ఈ వార్తలు మరింతగా జోరందుకున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న యాక్షన్ డ్రామా `భగవంత్ కేసరి`. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తు్న ఈ మూవీలోని కీలక పాత్రలో క్రేజీ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది.
ఈ సినిమా సెట్లో మోక్షజ్ఞ హీరోయిన్ శ్రీలీల, దర్శకుడు అనిల్ రావిపూడితో మాట్లాడుతున్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన వారంతా `భగవంత్ కేసరి`లో మోక్షజ్ఞ నటిస్తున్నాడా? అని కామెంట్లు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ మూవీలోని కీలక అతిథి పాత్రలో మోక్షజ్ఞ నటిస్తున్నాడని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నేపథ్యంలో మోక్షజ్ఞ `భగవంత్ కేసరి` సెట్లో కనిపించడంతో ఈ వార్తలు నిజమేనని బాలయ్య అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఎంత వరకు నిజం అన్నది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న `భగవంత్ కేసరి` దసరా కానుకగా అక్టోబర్ 19న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇందులో తొలిసారిగా బాలయ్య తెలంగాణ యాసలో డైలాగ్‌లు చెబుతూ పక్కా తెలంగాణ వ్యక్తిగా కనిపించబోతున్నారు. అనిల్ రావిపూడి మార్కు ఎంటర్ టైన్మెంట్తో పాటు బాలయ్య మార్కు ఊర మాస్ యాక్షన్‌తో ఈ సినిమా రూపొందుతోంది.