Amigos Teaser: ఒకేలా ఉన్న ముగ్గురు వ్యక్తుల కలయిక.. ఆ తర్వాత ఏం జరిగింది..?
Nandamuri Kalyan Ram’s Amigos Teaser Out: నందమూరి కళ్యాణ్ రామ్.. గతేడాది బింబిసార చిత్రంతో హిట్ అందుకొని హిట్ హీరోల లిస్ట్ లోకి చేరిపోయాడు. పీరియాడిక్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్నే కాకుండా మంచి కలక్షన్లను కూడా రాబట్టి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలించింది. ఇక ఈ హిట్ తర్వాత జోరు పెంచేసిన = కళ్యాణ్ రామ్ వరుస సినిమాలను లైన్లో పెట్టి, ఒక్కో సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి అమిగోస్. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోన కళ్యాణ్ రామ్ సరసన ఆషికా రంగనాధన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
అమిగోస్ టీజర్ చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అని పెద్దలు చెప్తుంటారు. ఆ ఏడుగురిలో ముగ్గురు ఒకే చోట కలిస్తే.. అలా కలవడానికి రీజన్ ఏంటి..? వారిని కల్పింది ఎవరు..? అసలు వారు ముగ్గురు కలిసి ఏం చేశారు..? అనే కొత్త కథ అమిగోస్. ఇందులో కళ్యాణ్ రామ్ .. సిద్ధార్థ్- మంజునాథ్ – మైఖేల్ అనే మూడు పాత్రల్లో కనిపించాడు. ఒకరి గురించి ఒకరికి తెలియదు.. ముగ్గురు మూడు విభిన్నమైన వ్యక్తిత్వాలు కలవారు. అయినా ఏదో ఒక పనికోసం ముగ్గురు ఒకటి అవుతారు..?ఇక ఈ ముగ్గురులో మైఖేల్ ఈ ఆటను ఆడిస్తూ ఉంటాడు. అసలు అతను ఎందుకు వచ్చాడు..? తనలా ఉన్న మరో ఇద్దరినీ అతను కనుక్కొని వారితో ఎందుకు పిల్లి- ఎలుక గేమ్ ఆడాడు అనేది సినిమా చూస్తే కానీ తెలియదు. మూడు పాత్రలో కళ్యణ్ రామ్ చూపించిన వేరియేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాలి. టీజర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 10 న ప్రేక్షకుల ముందు రానుంది. మరి ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.