Nandamuri Chaitanya Krishna: నందమూరి కుటుంబం నుంచి కొత్త హీరో.. ఎవరో తెలుసా..?
Nandamuri Chaitanya Krishna New Movie Title Launch March 5th: నెపోటిజం.. ఒకరి తరువాత ఒకరు.. ఒక మహావృక్షాన్ని పట్టుకొని పిల్ల కొమ్మలు ఎదుగుతున్నాయి. ఆ పిల్ల కొమ్మలు సైతం తమ వారసులను ప్రకటిస్తున్నారు.. అదే నెపోటిజం.. తెలుగులో వారసత్వం. ఇండస్ట్రీలో ఇదేమి కొత్తకాదు. తాజాగా నందమూరి కుటుంబం నుంచి మరో హీరో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే దాదాపు అరడజను మందికి పైగా హీరోలు నందమూరి కుటుంబం నుంచి వచ్చి టాలీవుడ్ ను ఏలుతున్నారు. ఇక తాజాగా మరో హీరో వీరిలో కలవనున్నాడు. అతడే నందమూరి చైతన్య కృష్ణ. ఎన్టీఆర్.. రెండో కుమారుడును నందమూరి జయకృష్ణ కుమారుడు.
చైతన్య చాలామందికి సుపరిచితమే. ఈ మధ్య తారకరత్న అంత్యక్రియల్లో అతనే అన్ని దగ్గరఉండి చూసుకున్నాడు. ఇక ఇప్పుడు అతడు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు నందమూరి కుటుంబం అధికారికంగా ప్రకటించింది. బసవతారక క్రియేషన్స్ బ్యానర్ లో వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా టైటిల్ ను మార్చి 5 న రివీల్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో ఈ నందమూరి హీరో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి.