Nandamuri Balakrishna: అబ్బాయ్ డైరెక్టర్ ను పట్టేసిన బాబాయ్..?
Nandamuri Balakrishna With Director Vasista: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం జోరు పెంచేశాడు. వయసు గురించి పట్టింపే లేదు. ఇప్పటికే చేతిలో రెండు సినిమాలను పెట్టుకొని మూడో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అఖండ నుంచి బాలయ్య దెబ్బకు థింకిం మారిపోయేలా చేస్తున్నాడు. హిట్ కొట్టిన ఏ డైరెక్టర్ ను వదలకుండా తన లైనప్ లోకి తెచ్చేసుకుంటున్నాడు. క్రాక్ తో గోపీచంద్ మలినేని హిట్ కొట్టాడో లేదో వీరసింహారెడ్డిని పట్టాలెక్కించేశాడు. ఎఫ్ 3 తో అనిల్ రావిపూడి హిట్ కొట్టాడు.. బాలయ్య నెక్స్ట్ సినిమా ప్రకటించేశాడు. ఇక ఈసారి మరో కుర్ర డైరెక్టర్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
నందమూరి కళ్యాణ్ రామ్ తో హిట్ అందుకున్న కుర్ర డైరెక్టర్ వశిష్ఠతో బాలయ్య సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డెబ్యూనే కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ఎంపిక చేసుకోవడం..దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం అందరికీ నచ్చింది. ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించిన బాలయ్య అప్పుడే నాతో సినిమా చేయవా..? అని సరదాగా అడిగేశాడు. నట సింహమే అడిగినప్పుడు కాదంటారా..? వెంటనే వశిష్ఠ సైతం మంచి కథను బాలయ్యకు వినిపించాడని, బాలయ్యకు కూడా నచ్చడంతో త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలో నిజమెంత.. అబ్బాయ్ డైరెక్టర్ తో బాబాయ్ కూడా హిట్ కొడతాడా..? లేదా..? అనేది చూడాలి.