Nandamuri Balakrishna: తిరుపతిలో సందడి చేసిన బాలయ్య
Nandamuri Balakrishna Watched Veerasimha Reddy With Fans: నందమూరి బాలకృష్ణ.. కుటుంబంతో సహా తిరుపతిలో సందడి చేశారు. చంద్రగిరి ఎస్వీ థియేటర్ లో బాలకృష్ణ.. అభిమానుల మధ్య కూర్చొని వీరసింహ రెడ్డి సినిమాను వీక్షించారు. నారావారిపల్లె నుంచి స్వయంగా కారులో బాలయ్య రాగా మరో కారులో నందమూరి మోక్షజ్ఞ, నారా దేవాన్ష్, వసుంధర దేవీ వచ్చారు. నందమూరి కుటుంబానికి అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.
వీర సింహా రెడ్డి సినిమాను అభిమానులతో వీక్షంచిన బాలయ్య అనంతరం 50కేజీల భారీ కేక్ కట్ చేశారు. ఇక బాలయ్య రావడంతో థియేటర్ వద్ద కోలాహలం మొదలైంది. జై బాలయ్య జై జై బాలయ్య అంటూ నినాదాలతో థియేటర్ మారుమ్రోగుతుంది. ఇక ముఖ్యంగా అందరి చూపు మోక్షజ్ఞ మీదనే ఉంది. సినిమా బావుందని, నాన్నగారి సినిమా అభిమానుల మధ్య చూడడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉండనున్నట్లు తెలుస్తోంది.