Nandamuri Balakrishna: నేను మూడో కన్ను తెరిస్తే.. ఏమవుతుందో తెలుసుకొని మలుచుకోండి
Nandamuri Balakrishna Warning To Ysrcp Mla Gopireddy Srinivasa Reddy: ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ గురించి అందరికి తెల్సిందే. కొట్టినా బాలయ్యే.. పెట్టినా బాలయ్యే. ముఖ్యంగా అభిమానుల విషయంలో మాత్రం బాలయ్య రూటే సపరేటు. అభిమానులను తిట్టాలన్నా.. కొట్టాలన్నా ఆయనే. నా కుటుంబం వారు. అందుకే కొడతాను అని నిర్మొహమాటంగా చెప్పుకొచ్చేస్తాడు. అందుకే బాలయ్య అంటే అభిమానులకు ఎంతో ఇష్టం. ఇక తన అభిమానులను ఎవరైనా ఇబ్బంది పెడితే మాత్రం బాలయ్య అసలు ఊరుకోడు. నరసరావుపేటలోని రామిరెడ్డిపేటలో శివరాత్రికి జరిగిన కోటప్పకొండ తిరునాళ్లలో బాలయ్య సాంగ్ పెట్టి డ్యాన్స్ వేసినందుకు ఒక యువకుడిని ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మందలించాడు. దీంతో సదరు యువకుడు ఎమ్మెల్యే ఇంటిముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.
తాజాగా ఈ ఘటనపై బాలయ్య ఫైర్ అవుతూ వార్నింగ్ ఇచ్చాడు. తెనాలిలో పెమ్మసాని థియేటర్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..ఇటీవల నరసరావుపేటలో జరిగిన వేడుకల్లో తన సినిమా పాటలు తొలగించాలని ఒక ఎమ్మెల్యే చెప్పడం సరి కాదని రాజకీయాలకు సినిమాలకు ముడి పెట్టవద్దు అని ఆయన అన్నారు. తాను చిటికేస్తే, మూడో కన్ను తెరిస్తే, ఏమవుద్దో తెలుసుకుని మసలుకోవాలని హెచ్చరించారు. రాజకీయాలను రాజకీయాలుగానే చూడాలని, మరోసారి ఇటువంటి ఘటన జరిగితే చూస్తూ ఊరుకోనని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం బాలయ్య వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.