Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణకు కరోనా
Nandamuri Balakrishna Tested Corona Positive: గత రెండేళ్లుగా ప్రజలను పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా. ఇప్పుడిప్పుడే ఈ మహమ్మారి తగ్గు ముఖం పట్టింది అనుకొని సంతోషించేలోపు రోజురోజుకు కేసులో పెరగడం భయాందోళనలకు గురిచేస్తోంది. తాజాగా నందమూరి నట సింహం బాలకృష్ణ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
“స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్ అని తెలిసింది. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాను. గత రెండు, మూడు రోజులు నా పక్కన తిరిగిన వారు దయచేసి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా వారు ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలని తెలుపుతున్నాను. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను.. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తాను” అని తెలిపారు. ఇక ఈ వార్త విన్న బాలయ్య అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.