Sreeleela:ఎంబీ బీఎస్ పూర్తి చేసిన కన్నడ క్రేజీ హీరోయిన్ శ్రీలీల `పెళ్లి సందడి`(Pelli Sandadi) మూవీతో తెలుగులో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. తొలి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న శ్రీలీల టాలీవుడ్ వర్గాలని ఆకర్షించింది.
Sreeleela:ఎంబీ బీఎస్ పూర్తి చేసిన కన్నడ క్రేజీ హీరోయిన్ శ్రీలీల `పెళ్లి సందడి`(Pelli Sandadi) మూవీతో తెలుగులో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. తొలి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న శ్రీలీల టాలీవుడ్ వర్గాలని ఆకర్షించింది. అందం, అభినయం, అంతకు మించిన స్పీడుతో వరుసగా క్రేజీ స్టార్లతో కలిసి నటించే ఆఫర్లని దక్కించుకుంటూ ఆశ్చర్యపరుస్తోంది. `ధమాకా`తో బ్లాక్ బస్టర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న శ్రీలీల ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ SSMB28, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ `ఉస్తాద్ భగత్ సింగ్`, విజయ్ దేవరకొండ మూవీల్లో నటిస్తోంది.
వీటితో పాటు నితిన్ 32వ సినిమా, పంజా వైష్ణవ్ తేజ్ `ఆదికేశవ`, రామ్ ,బోయపాటి సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 108వ ప్రాజెక్ట్ కూడా చేస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో బాలకృష్ణ మేనకోడలిగా శ్రీలీల కనిపించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ఈ భారీ చిత్రాన్ని హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
పక్కా తెలంగాణ నేపథ్యంలో బాలయ్య క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా ఉంటుందని దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్‌లతో స్పష్టమైంది. దసరాకు భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని శరవేగంగా సినిమా షూటింగ్‌ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల బాలకృష్ణ, శ్రీలీలపై ఓ సన్నివేశాన్ని రూపొందించారట. అయితే ఈ సందర్భంగా బాలయ్య హీరోయిన్ శ్రీలీలపై చేయి చేసుకున్నారని తెలుస్తోంది.
బాలయ్య..శ్రీలీల చెంప చెల్లుమనిపించడంతో ఒక్కసారిగా ఏడ్చేసినట్టుగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. సినిమా చిత్రీకరణలో భాగంగా బాలయ్య, శ్రీలీలపై ఓ సన్నివేశాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్నారు. ఈ సన్నవేశంలో శ్రీలీలని బాలకృష్ణ కొట్టాలి. ఇందుకు బాలయ్య మొహమాట పడుతుంటే శ్రీలీలనే కొట్టమని చెప్పిందట. దాంతో బాలయ్య సన్నివేశం బాగా రావాలనే శ్రీలీల ఆలోచనతో చెంప చెల్లుమనిపించారట. ఈ బాధకు ఆమె ఏడ్చినట్టుగా యూనిట్ వర్గాలు అంటున్నాయి. ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.