Nandamuri Balakrishna: వీరసింహారెడ్డి ఎఫెక్ట్.. మరో ముగ్గురు కన్ఫర్మ్..?
Nandamuri Balakrishna Green Signal To 3 Directors: అఖండతో ఇండస్ట్రీని షేక్ చేసిన బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో ఆ విజయాన్ని కంటిన్యూ చేశాడు. సంక్రాంతి పోరులో చిరుకు పోటీగా నిలబడిన బాలయ్య.. తనకు తగ్గ రికార్డు కలక్షన్స్ కురిపిస్తూ షేక్ ఆడిస్తున్నాడు. తొలిరోజే 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం.. ఆ తర్వాత 4 రోజుల్లోనే మరో 50 కోట్లు వసూలు చేసి 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇక ముందు ముందు ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చెప్పలేం. ఇక ఈ సినిమా జోరుతో బాలయ్య మరో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న బాలయ్య.. ఈ సినిమా తరువాత బోయపాటి శ్రీను తో కలిసి అఖండ 2 ను ప్లాన్ చేస్తున్నాడట.
అఖండ సమయంలోనే దానికి సీక్వెల్ ఉందనున్నట్లు బోయపాటి చెప్పిన విషయం తెల్సిందే. ఇక ఈ సినిమాతో పాటు ప్రశాంత్ వర్మ కథను కూడా ఓకే చేసాడట. హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ.. బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ షో ప్రోమోకు దర్శకత్వం వహించాడు. ప్రశాంత్ వర్మ టేకింగ్‌కు ఫిదా అయిన బాలయ్య.. ఆయనతో కు సిద్ధమైపోయారు. ఇక ముచ్చటగా మూడో డైరెక్టర్ గా వశిష్ఠ పేరు వినిపిస్తోంది. అబ్బాయ్ కళ్యాణ్ రామ్ కు బింబిసార లాంటి హిట్ ఇచ్చిన ఈ కుర్ర డైరెక్టర్ తో మరో పీరియాడికల్ డ్రామా ప్లాన్ చేస్తున్నాడట బాలయ్య.. ఒకవేళ ఈ మూడు సినిమాలు నిజమే అయితే బాలయ్య లైనప్ మాత్రం ఓ రేంజ్ లో ఉంటుందని అభిమానులు అంటున్నారు.