Nandamuri Balakrishna: నిమ్మకూరులో బాలయ్య సందడి
Nandamuri Balakrishna Created Buzz In Nimmakuru: నందమూరి బాలకృష్ణ నేడు నిమ్మకూరులో సందడి చేశారు. నందమూరి తారక రామారావు సొంత ఊరు నిమ్మకూరు అన్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చేసాక.. నిమ్మకూరుకు ఎప్పుడో ఒకసారి వెళ్తుండేవారట. ఇప్పుడు నందమూరి వారసులు కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు. ఇక నేడు బాలయ్య నిమ్మకూరుకు వెళ్లి సందడి చేశారు.
సొంత ఊరుకు బాలయ్య రావడంతో బంధువులు, అక్కడి మహిళలు ఆయనకు ఎదురు వచ్చి బాలయ్యకు ఘన స్వాగతం పలికారు. జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. బాలయ్య వచ్చాడని తెలియడంతో కుర్రకారు.. ఆయనను చూడడానికి క్యూ కట్టారు. ఇక పక్కనే ఉన్న మహిళా కళాశాల విద్యార్థినిలతో బాలయ్య కొద్దిసేపు ముచ్చటించారు. అందరు బాగా చదువుకోవాలని, మహిళలే భావితరాలకు భవిష్యత్తు అని తెలిపారు. అనంతరం బంధువుల ఇంటికి వెళ్లి..వారితో కొద్దిసేపు సరదాగా గడిపారు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.