Nandamuri Balakrishna: హీరోయిన్ కు కాస్ట్లీ నెక్లస్ గిఫ్ట్ ఇచ్చిన బాలయ్య.. ఎందుకో తెలుసా..?
Nandamuri Balakrishna And Pragya Jaiswal AD Shoot Photos: టైటిల్ చూసి.. ఏంటి నిజమా.. ఎందుకు.. ఎందుకు అని కంగారు పడకండి.. అది జస్ట్ యాడ్ కోసం మాత్రమే. గత కొంతకాలంగా బాలయ్య కూడా వాణిజ్య ప్రకటనల్లో మెరుస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే రెండు మూడు యాడ్స్ ను చేసిన బాలయ్య తాజాగా మరో ప్రకటనలో కనిపించనున్నాడు. వేగ శ్రీ జువెలరీ అండ్ డైమండ్స్ సంబంధించిన ఈ యాడ్ షూట్ లో బాలయ్యతో పాటు అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ కూడా మెరిసింది. నందమూరి బాలకృష్ణ వేగా జువెలర్స్ వేగా శ్రీ గోల్డెన్ డైమండ్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారని కొంత కాలం పాటు ఆయన ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయబోతున్నారని మేకర్స్ తెలిపారు.
ఇక వీరిద్దరి జంట అఖండలో ప్రేక్షకులను ఎంత బాగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ఈ యాడ్ లో కూడా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకొంది. యాడ్ ఇంకా టెలికాస్ట్ అవ్వకపోయినా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.పెళ్ళికి సంబంధించిన యాడ్ లా కనిపిస్తోంది. ఇందులో ప్రగ్యాకు బాలయ్య కాస్ట్లీనెక్లస్ ను గిఫ్ట్ గా ఇస్తున్నట్లు కనిపించింది. మరి ఈ యాడ్ ఎలా ఉండనుందో చూడాలంటే అది టెలికాస్ట్ అయ్యేవరకు ఆగాల్సిందే.