మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకపక్క నటుడిగా.. ఇంకోపక్క జనసేన నాయకుడిగా.. బిజీగా బిజీగా ఉంటున్నాడు.
మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకపక్క నటుడిగా.. ఇంకోపక్క జనసేన నాయకుడిగా.. బిజీగా బిజీగా ఉంటున్నాడు. ఇక మరోపక్క సోషల్ మీడియా లో తన మనసుకు అనిపించిన అభిప్రాయాలను అభిమానులతో వెల్లడిస్తూ ఉంటాడు. అంతేకాదు తన అన్న చిరును కానీ, తమ్ముడు పవన్ కళ్యాణ్ ను కానీ ఎవరైనా ఏదైనా అంటే.. అస్సలు ఊరుకోడు. అటు సున్నితంగా కాకుండా ఇటు ఘాటుగా కాకుండా.. మాటకు మాట ఇచ్చిపడేస్తాడు. ఇక తాజాగా నాగబాబు.. సైలెన్స్ నుంచి వైలెన్స్ లోకి దిగినట్లు తెలుస్తోంది. ఒక్క పోస్ట్ తో నాగబాబు అందరికీ చెమటలు పట్టించాడు. వేట కొడవలి పట్టిన నాగబాబు అంతకు మించిన కొటేషన్ చెప్పుకొచ్చాడు. “మంచి అనేది విఫలం చెందినప్పుడు న్యాయం, శాంతి సాధించడానికి హింసే మార్గం” అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఏదైనా సినిమా కోసం ఈ డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడ.. లేక జనసేన పై కామెంట్స్ చేసిన వారికి వార్నింగ్ ఇస్తున్నాడా..? అనేది తెలియాల్సి ఉంది. అయితే కొంతమంది మాత్రం.. నాగబాబు సినిమాలోని డైలాగ్ అని చెప్పుకొస్తున్నారు.
తమిళ్ లో నాగబాబు.. రజినీకాంత్ నటిస్తున్న జైలర్ లో నటిస్తున్నాడు. అందుకు సంబంధించిన షూటింగ్ లోని ఫోటో అయ్యి ఉంటుందని అంటున్నారు.ఇకపోతే ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. కానీ, అభిమానులు మాత్రం..ఇలాంటి వ్యాఖ్యలు పబ్లిక్ లో చేయడం నేరమని కొందరుహితవు పలుకుతున్నారు.. జన సైనికులు మాత్రం ఆవేశానికి గురవుతున్నారు. ఇది కదా మనకు కావాల్సింది. మీరు తగ్గొద్దు మీ వెనుక మేమున్నాం అని నాగబాబుకు హామీ ఇస్తున్నారు. మరి నాగబాబు ఈ వ్యాఖ్యలు దేని గురించి చేశాడో తెలియాల్సి ఉంది.
https://www.instagram.com/p/CsP_U3nRSGn/?igshid=NTc4MTIwNjQ2YQ==