Naga Chaitanya: అక్కినేని తొక్కినేని అన్న బాలయ్య.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన చైతన్య
Naga Chaitanya Strong Counter To Balakrishna: అక్కినేని- నందమూరి కుటుంబాల మధ్య చిచ్చు రేగింది. నందమూరి బాలకృష్ణ చేసిన కొన్ని వ్యాఖ్యలు అక్కినేని అభిమానులనే కాదు అక్కినేని కుటుంబాన్ని కూడా హార్ట్ చేశాయి. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ సడెన్‌గా సినిమాలో ఆర్టిస్టుల గురించి ప్రస్తావించారు. తమ మధ్య రకరకాల విషయాలు చర్చకు వస్తాయి.. నాన్న గారు, ఆ డైలాగులు, రంగారావు గారు, ఈ అక్కినేని.. తొక్కినేని అంటూ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో అక్కినేని ఫ్యాన్స్ బాలయ్యపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇక ఈ వ్యాఖ్యలపై అక్కినేని నట వారసులు స్పందించారు. “నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్ వి రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం..” అంటూ నాగ చైతన్య, అఖిల్ తమ ప్రెస్ నాట్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ గా మారాయి.