Naga Chaitanya: కొత్త ఇంటిలోకి అడుగుపెట్టిన అక్కినేని వారసుడు
Naga Chaitanya Moved To A New House: అక్కినేని నాగచైతన్య కొత్త ఇంటికి మారాడు. సమంతతో పెళ్లి అయ్యాకా వీరు మురళీ మోహన్ వద్ద ఒక కొత్త ఫ్లాట్ ను కొనుగోలుచేసి తమకు నచ్చిన విధంగా మార్చుకున్న విషయం తెల్సిందే. తమ డ్రీమ్ హౌస్ గా పిలుచుకున్న ఈ ఇంటిని విడాకుల తరువాత సామ్ కు ఇచ్చేసి చై బయటకు వచ్చేశాడు. ఇక విడాకులు అయ్యిన దగ్గరనుంచి చై హోటల్స్ లోనే ఉంటున్నాడట. నాగార్జున ఇంటికి వెళ్లినా కొద్దిసేపు ఉండి వస్తున్నాడే కానీ ఎక్కువ రోజులు అయితే ఉండడం లేదని టాక్.
ఇక గత ఏడాది మొదట్లో చై, నాగార్జున ఇంటికి దగ్గర్లో ఒక స్థలాన్ని కొని, తనకు నచ్చినట్లు ఒక కొత్త ఇల్లును నిర్మించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ ఇంట్లోనే పదిరోజుల క్రితం చై గృహప్రవేశం చేసాడట. తనకు నచ్చిన విధంగా స్విమ్మింగ్ పూల్, జిమ్, గార్డెన్ ను ఏర్పాటుచేసుకున్నాడని తెలుస్తోంది. ఇక నాగ్ ఇంటికి కూడా దగ్గర కావడంతో వారు కూడా అప్పుడప్పుడు రాకపోకలు సాగిస్తున్నారట. ఇక సినిమాల విషయం కొస్తే చై.. ప్రస్తుతం కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరి ఈ సినిమాతో చై ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.