Nabha Natesh: కొత్త ఏడాది ఇస్మార్ట్ బ్యూటీ ఇంత పెద్ద షాకింగ్ న్యూస్ చెప్పిందేంటి..?
Nabha Natesh Recovered From The Accident: ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక్కసారిగా పూరి హీరోయిన్ లిస్ట్ లో చేరిపోయింది నభా నటేష్. ఈ సినిమా తరువాత అమ్మడికి అవకాశాలు క్యూ కడతాయి అనుకున్నారు. కానీ, ఎందుకో నభాకు మాత్రం అవకాశాలు అందలేదు. చివరగా ఈ చిన్నది నితిన్ సరసన మ్యాస్ట్రో సినిమాలో కనిపించింది. ఆ తరువాత సినిమాలకు గ్యాప్ ఇవ్వడంతో ఛాన్సులు రావడం లేదు అనుకున్నారు. కానీ అసలు నిజం అదికాదట. నభా గతేడాది ఒక పెద్ద యాక్సిడెంట్ కు గురయ్యిందట. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది.
“నేను కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మీరందరూ నన్ను మిస్ అయ్యారని నాకు తెలుసు. అలాగే నేను కూడా మిమ్మల్ని మిస్ అయ్యాను. గత ఏడాది కాలం నాకు చాలా కఠినంగా సాగింది. నేను ఓ ప్రమాదానికి గురయ్యాను. నా ఎడమ భుజానికి తీవ్రంగా గాయమైంది. మల్టిపుల్ బోన్ ఫ్రాక్చర్ జరిగింది. అంతేకాకుండా కొన్ని కాంప్లికేటెడ్ సర్జరీలు కూడా జరిగాయి. ఆ సమయంలో నేను మానసికంగా, శారీరకంగా భరించలేని బాధని అనుభవించాను. కానీ సినిమాలు ద్వారా నేను మిమ్మల్ని అలరించినందుకు బదులుగా మీరు అందించిన ప్రేమ నాకు ధైర్యాన్ని ఇచ్చింది. నేను ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాను. గతంలో కంటే బలంగా మారాను. ఇప్పుడు మళ్ళీ సినిమాలతో అలరించేందుకు నేను కెమెరా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ విషయం మీతో షేర్ చేసుకోడానికి చాలా సంతోషంగా ఉంది” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం విన్న ఆమె అభిమానులు ఆమె ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.