Karate Kalyani:నందమూరి తారక రామారావు(NTR)పై నటి కరాటే కల్యాణి చేసిన అనుచిత వ్యాఖ్యలను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(Maa) సీరియస్‌గా తీసుకుంది. మా అధ్యక్షులు మంచు విష్ణు(Manchu Vishnu) ఫైర్ అయ్యారు.
Karate Kalyani:నందమూరి తారక రామారావు(NTR)పై నటి కరాటే కల్యాణి చేసిన అనుచిత వ్యాఖ్యలను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(Maa) సీరియస్‌గా తీసుకుంది. మా అధ్యక్షులు మంచు విష్ణు(Manchu Vishnu) ఫైర్ అయ్యారు. ఆమెపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా షోకాజ్ నోటీసులు జారి చేశారు. కరాటే కల్యాణి తను చేసిన వ్యాఖ్యలపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. దీంతో కరాటే కల్యాణి వివాదం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఖమ్యంలో ఈ నెల 28న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరగనుంది.
ఈ సందర్భంగా కరాటే కల్యాణి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వీళ్లేదని, అందుకు తమ వర్గం వారు అంగీకరించరని ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసింది. కల్యాణి చేసిన వ్యాఖ్యలపై నెట్టింట తీవ్ర దుమారం మొదలైంది. ఆమెని తప్పుపడుతూ పలువురు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఒక నటిగా తను అలా మాట్లాడటం సరైన పద్దతి కాదని ఫైర్ అవుతున్నారు.
ఇటీవల ఈ వివాదంపై మీడియాతో మాట్లాడిన కరాటే కల్యాణి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు అడ్డుతగలొద్దని మంచు విష్ణు తనని కోరారని, అయితే తాను మాత్రం యాదవ హక్కుల పరిరక్షణ కోసం పని చేస్తానని, కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నాని షాకింగ్ కామెంట్లు చేశారు. దీంతో రంగంలోకి దిగిన మంచు విష్ణు నటి కరాటే కల్యాణికి క్రమశిక్షణ ఉల్లంఘన కింద సోకాజ్ నోటీసులు జారి చేసినట్టుగా తెలుస్తోంది.
మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఖమ్మంలో విగ్రహావిష్కరణని స్టార్ హీరో జూ.ఎన్టీఆర్ ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే ఆయనకు ఆహ్వానం అందింది. ఈ నేఫథ్యంలో కరాటే కల్యాణి చేసిన వ్యాఖ్యలు చర్చినీయాంశంగా మారాయి.`మా` అసోసియేషన్ షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై కరాటే కల్యాణి ఎలా స్పందించనుందో చూడాలి.